Music Shop Murthy : డీజేగా మారిన అజయ్ ఘోష్.. మ్యూజిక్ షాప్ మూర్తి సాంగ్ విన్నారా?

తాజాగా మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా నుంచి ‘అంగ్రేజీ బీట్..' అంటూ అదిరిపోయే సాంగ్ ని విడుదల చేశారు.

Ajay Ghosh Chandini Chowdary Music Shop Murthy Movie Angrezi Beat Lyrical Song Released

Music Shop Murthy Song : పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్న అజయ్ ఘోష్ ఇప్పుడు మెయిన్ లీడ్ లో ఓ సినిమాతో రాబోతున్నారు. అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాణంలో శివ పాలడుగు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు.

Also Read : Balakrishna : ఎన్నికలు ముగిశాయి.. షూట్‌లో అడుగుపెడుతున్న బాలయ్య బాబు..

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాగా మ్యూజిక్ షాప్ మూర్తి రాబోతుంది. క్యాసెట్లు అమ్ముకునే ఓ పెద్దాయన డీజేగా ఎలా మారాడు అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా నుంచి ‘అంగ్రేజీ బీట్..’ అంటూ అదిరిపోయే సాంగ్ ని విడుదల చేశారు. ఈ పాటలో డీజేగా మారి అజయ్ ఘోష్ అదరగొట్టేసారు. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..

ఇక ఈ పాటకు పవన్ సాహిత్యంతో పాటు సంగీతం అందించగా రాహుల్ సిప్లిగంజ్ పాటను పాడారు. మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.