Arvind Kejriwal: ఇలా చేస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం: హైదరాబాద్‌లో కేజ్రీవాల్

"ఢిల్లీ ప్రజలకు న్యాయం జరిగేందుకు కేసీఆర్ మద్దతు ఇస్తామన్నారు. కేసీఆర్ కు ధన్యవాదాలు" అని కేజ్రీవాల్ చెప్పారు.

Centre’s Delhi ordinance: తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR)తో సమావేశమైన తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) హైదరాబాద్ (Hyderabad)లో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ(Delhi)లో పాలనా అధికారాలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకి వ్యతిరేకంగా కేసీఆర్ మద్దతు ఇచ్చారని చెప్పారు.

“ఢిల్లీ ప్రజలకు న్యాయం జరిగేందుకు కేసీఆర్ మద్దతు ఇస్తామన్నారు. కేసీఆర్ కు ధన్యవాదాలు. ఉద్యోగాల నియామకాలకు, ట్రాన్స్ఫర్ రాష్ట్రం చేతిలో ఉండాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. మోదీ.. ఆర్డినెన్సును తీసుకొచ్చారు. సుప్రీంతీర్పును పట్టించుకోవడం లేదు.. ఇలాగైతే ఎలా?

ఢిల్లీలోనే కాదు.. బీజేపీయేతర పార్టీలు ఉన్న ప్రతి రాష్ట్రాన్ని మోదీ వేధిస్తున్నారు. కేసులు, ఎమ్మెల్యేల కొనుగోలుతో ప్రభుత్వాలను అస్థిర పరుస్తున్నారు. నేను సీఎం గా ఉండి… ఒక్క ఉద్యోగిని కూడా నియమించలేక పోతున్నా. రాజ్యసభలో ఆర్డినెన్సు ఒడిస్తే… వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం అవుతుంది” అని కేజ్రీవాల్ చెప్పారు.

దేశం మొత్తం చూస్తోంది: పంజాబ్ సీఎం
పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ మాట్లాడుతూ… “ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కేంద్రం వేధిస్తోంది. గవర్నర్లతో ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్నారు. రాజ్ భవన్లు బీజేపీ కార్యాలయాలుగా మారుతున్నాయి. ఢిల్లీ, బెంగాల్, తమిళనాడులో గవర్నర్ వ్యవహారం దేశం మొత్తం చూస్తోంది. కేంద్రం ఇష్టారీతిన వ్యవహరిస్తోంది.. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు” అని చెప్పారు.

Centre’s Delhi ordinance: వాత పెట్టినా బీజేపీకి బుద్ధి రావడం లేదు: కేసీఆర్

ట్రెండింగ్ వార్తలు