ATM Cash : న్యూ ఇయర్ నుంచే..పెరగనున్న ఏటీఎం చార్జీలు

పరిమితికి మించి...చేసే విత్ డ్రాయల్స్ పై ఉన్న ఛార్జీలు పెంచాలని బ్యాంకులు డిసైడ్ అయ్యాయి.

ATM Cash Withdrawal : బ్యాంకుల లావాదేవీలపై పలు బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. ఏటీఎం నుంచి పరిమితికి మించి..ఎక్కువసార్లు డబ్బులు తీసుకొంటే చార్జీలు పెరగనున్నాయి. సొంత బ్యాంకుతో పాటు..ఇతర బ్యాంకుల్లో ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే..పరిమితికి మించి…చేసే విత్ డ్రాయల్స్ పై ఉన్న ఛార్జీలు పెంచాలని బ్యాంకులు డిసైడ్ అయ్యాయి. వివిధ బ్యాంకుల ఏటీఎంల వద్ద నెలవారీ ఉచిత పరిమితిని మించి జరిపే లావాదేవీలపై పెంచిన చార్జీలను 2022, జనవరి నుంచి అమల్లోకి తీసుకరానున్నాయి.

Read More : Cyclone Jawad : విజయనగరంలో రెండు రోజులు పాఠశాలలకు సెలవు, విశాఖకు పర్యాటకులు రావొద్దు

2021, జనవరి 01వ తేదీ నుంచి ఏటీఎం చార్జీలను పెంచుతున్నట్లు ప్రైవేటు బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. ఉచితంగా పరిమితిని దాటి చేసే నగదు విత్ డ్రాయల్స్, డిపాజిటల్ లావాదేవీలపై ప్రతి ట్రాన్సాక్షన్ కు రూ. 21తో పాటు…జీఎస్టీ వసూలు చేయనున్నామని తెలిపింది. తమ ఖాతాదారులు, ఇతర బ్యాంకు ఖాతాదారులు గమనించాలని సూచించింది. పరిమితికి మించి..జరిపే ప్రతి లావాదేవీపై ఇంటర్ చేంజ్ ఫీజు రూ. 15 నుంచి రూ. 17, ఆర్థికేతర లావాదేవీలకు రూ. 5 నుంచి రూ. 6 వరకు పెంచడానికి ఆర్బీఐ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు ఒకటో తేదీ నుంచే ఈ నిబంధన అమల్లోకి వచ్చింది.

Read More : Congress : కాంగ్రెస్‌కి షాక్.. రాజీనామా చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి

వివిధ బ్యాంకు ఖాతాదారులు తమ సొంత బ్యాంకు ఏటీఎం నుంచి ప్రతి మంత్…ఐదు ఉచితంగా లావాదేవీలు పొందే అవకాశం ఉంది. మెట్రో నగరాల పరిధిలో ఇతర బ్యాంకు ఏటీఎంలలో మూడుసార్లు, నాన్ మెట్రో నగరాల్లో ఐదుసార్లు ఉచితంగా డబ్బులు తీసుకొనే సౌలభ్యం ఉంది. దీనికి మించ ఎక్కువ సార్లు లావాదేవీలు జరిపితే…చార్జీలు వసూలు చేస్తారు.

ట్రెండింగ్ వార్తలు