Bandi Sanjay: ప్రాణహిత పుష్కరాలకు తక్షణమే నిధులు కేటాయించాలి: బండి సంజయ్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మొదటిసారిగా జరుగుతున్న ప్రాణహిత పుష్కరాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మొదటిసారిగా జరుగుతున్న ప్రాణహిత పుష్కరాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ..ప్రాణహిత పుష్కరాలకు ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 13 నుండి అత్యంత పవిత్రమైన ప్రాణహిత నది పుష్కరాలు ప్రారంభం కానున్నయని..రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకపోవడం దారుణమని బండి సంజయ్ అన్నారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ప్రాణహిత పుష్కరాలకు తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు కాళేశ్వరం తరలివచ్చే అవకాశం ఉందని బండి సంజయ్ అన్నారు.

Also read:Minister KTR: బీజేపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అంతు చూస్తాం: మంత్రి కేటీఆర్

హిందువులు ఎంతో భక్తిశ్రద్దలతో ప్రాణహిత పుష్కరాల్లో స్నానాలు చేసి, పూజలు నిర్వహించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం అత్యంత దారుణమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ప్రాణహిత నదికి ఇవే తొలి పుష్కరాలు కాగా..పుష్కరాళ్ళపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించి పుష్కరాళ్లకు వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని బండి సంజయ్ కోరారు.

Also read:RTC Charges Hike : ఆర్టీసీ గట్టెక్కాలంటే.. చార్జీల పెంపు తప్పనిసరి-బాజిరెడ్డి

ట్రెండింగ్ వార్తలు