BJP Candle Rally : బీజేపీ క్యాండిల్ ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణ…

ఎంపీ బండి సంజయ్‌ అరెస్ట్ నేపథ్యంలో నిరసనగా మంగళవారం సాయంత్రం 5 గంటలకు బీజేపీ క్యాండీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ క్యాండిల్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది.

BJP Candle Rally : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అరెస్ట్, 14 రోజుల రిమాండ్‌కు పంపిన తీరును బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. జీవో317కు నిరసనగా సంజయ్‌ చేపట్టిన జాగరణ దీక్షభగ్నంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై పార్టీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం (జనవరి 4) సాయంత్రం 5 గంటలకు బీజేపీ క్యాండీ ర్యాలీ నిర్వహించనుంది.  అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా ఈ ర్యాలీలో పాల్గొననున్నారనే నేపథ్యంలో బీజేపీ క్యాండిల్ ర్యాలీకి పోలీసులు అనుమతికి నిరాకరించినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఈ ర్యాలీని ప్రతిష్టాతక్మంగా తీసుకున్నారు. పోలీసులు అడ్డుకున్నా.. క్యాండిల్ ర్యాలీ నిర్వహించి తీరుతామని బీజేపీ స్పష్టం చేసింది. ర్యాలీలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న జేపీ నడ్డాను శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచే పోలీసులు అడ్డుకునే అవకాశం కనిపిస్తోంది. జేపీ నడ్డాను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆర్ఎస్ఎస్ సమావేశాలు జరిగే అన్నోజిగూడ ఆర్వీకే కేంద్రానికి తరలించే అవకాశం ఉంది. పోలీసుల నుంచి అనుమతి లభించకపోయినా బీజేపీ శ్రేణులు సికింద్రాబాద్ లోని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి ఫ్యారడైజ్ సర్కిల్ వరకు శాంతి ర్యాలీని చేపట్టనుంది. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీని నిర్వహిస్తున్నామని కమలనాథులు స్పష్టం చేస్తున్నారు.

క్యాండిల్ ర్యాలీని ముందుగా ఎల్బీ స్టేడియం వద్ద బాబూ జగ్జీవన్ రాం విగ్రహం నుంచి లిబర్టీ వరకు నిరసన ర్యాలీ చేపట్టలనీ బీజేపీ రాష్ట్ర నేతలు భావించారు. అనివార్య కారణాలతో బీజేపీ నిరసన వేదిక మారింది. సికింద్రాబాద్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు శాంతి ర్యాలీని బీజేపీ చేపట్టనుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే శాంతి ర్యాలీ చేపట్టినట్టు కమలనాథులు చెబుతున్నారు.

ఈ రోజు సాయంత్రం 5గంటలకు జరగున్న శాంతి ర్యాలీ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జె.పి నడ్డా పాల్గొననున్నారు. కరోనా నేపథ్యంలో బీజేపీ నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతినిస్తారా? లేదా అనేదానిపై సందిగ్ధత నెలకొంది. జేపీ నడ్డా కూడా ర్యాలీలో పాల్గొననుండటంతో పోలీసులు అనుమతిని నిరాకరించినట్టు తెలుస్తోంది.  అయితే పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ర్యాలీ చేసి తీరుతామని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లనున్నారు. జైల్లో ఉన్న రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో ములాఖత్ కానున్నట్టు సమాచారం.

Read Also : BJP Protest Rally : మారిన బీజేపీ నిరసన వేదిక.. శాంతి ర్యాలీ.. ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

ట్రెండింగ్ వార్తలు