RCB vs CSK : ఉత్కంఠ పోరులో బెంగళూరు విజయం.. పోరాడి ఓడిన చెన్నై.. ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ

చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌పై 27 పరుగుల తేడాతో బెంగళూరు గెలిచింది. ఆఖరి పోరులో ఓటమితో చెన్నై టోర్నీ నుంచి నిష్ర్కమించగా.. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.

RCB vs CSK :చివరి వరకు ఉత్కంఠగా సాగిన కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌పై 27 పరుగుల తేడాతో బెంగళూరు గెలిచింది. దాంతో ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. 219 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై పోరాడి ఓడింది. ఫలితంగా సీఎస్‌కే టోర్నీ నుంచి నిష్ర్కమించింది. చెన్నై ప్లేయర్లలో రచిన్ రవీంద్ర (61; 37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్) హాఫ్ సెంచరీ నమోదు చేయగా, రవీంద్ర జడేజా (42 నాటౌట్) అజేయంగా నిలిచాడు.

ఎంఎస్ ధోని (25), అజింక్య రహానె (33) పరుగులతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో శార్దూల్ ఠాకూర్ (1 నాటౌట్), శివం ధూబే (7), మిచెల్ సాంట్నర్ (3), డారిల్ మిచెల్ (4) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. బెంగళూరు బౌలర్లలో యశ్ దయాళ్ 2 వికెట్లు పడగొట్టగా, గ్లెన్ మాక్స్ వెల్, మహ్మద్ షిరాజ్, లాకీ ఫెర్గూసన్, కామెరాన్ గ్రీన్ తలో వికెట్ తీసుకున్నారు. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 7 వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమితమైంది.

 ప్లేఆఫ్స్‌కు బెంగళూరు :
చెన్నైపై విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 7 గెలిచి 7 ఓడి (+0.459) 14 పాయింట్లతో టాప్ 4లో నిలిచి ఫ్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంది. టోర్నీ నుంచి నిష్ర్కమించిన చెన్నై జట్టు ఆడిన 14 మ్యాచ్‌ల్లో 7 గెలిచి 7 ఓడి (+0.392) 14 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. కానీ, ప్లేఆఫ్స్ చివరి బెర్త్ బెంగళూరుకు దక్కింది. రాయల్ ఛాలెంజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన డుప్లెసిస్ (54)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

చెన్నై టార్గెట్ 219
చెన్నై సూపర్ కింగ్స్ ముందు బెంగళూరు 219 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. విరాట్ కోహ్లీ 47, డు ప్లెసిస్ 54 (రనౌట్), రజత్ పటీదార్ 41, కామెరూన్ గ్రీన్ 38 (నాటౌట్), దినేశ్ కార్తీక్ 14, మ్యాక్స్ వెల్ 16, మణిపాల్ 0 పరుగులు తీశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో స్కోరు రెండు 5 నష్టానికి 218గా నమోదైంది. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్‌కు 2, తుషార్, సాంట్నర్ కు చెరో వికెట్ దక్కింది.

54 పరుగులకు డుప్లెసిస్ ఔట్
డెప్లెసిస్ 54 పరుగులకు రనౌట్ అయ్యాడు. క్రీజులో రజత్ పటీదార్, కామెరూన్ గ్రీన్ ఉన్నారు.

47 పరుగులకు కోహ్లీ ఔట్
విరాట్ కోహ్లీ 47 పరుగులకు మిచెల్ సాంట్నర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి రజత్ పటీదార్ వచ్చాడు.

మ్యాచ్ మళ్లీ షురూ
బెంగళూరు మ్యాచుకి వరుణుడి అడ్డంకి తొలిగింది. వాన వెరియడంతో కోహ్లీ, డుప్లెసిస్ మళ్లీ బ్యాటింగ్ చేస్తున్నారు.

మ్యాచుకి అడ్డంకి
మ్యాచుకి అడ్డంకి సృష్టించాడు వరుణుడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లు మూడు ఓవర్ల నాటికి 31 పరుగులు చేశారు. కోహ్లీ(19), డు ప్లెసిస్ (12) క్రీజులో ఉన్నారు. అదే సమయంలో వర్షం పడడంతో మ్యాచు ఆగింది.

ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్
చెన్నై సూప‌ర్ కింగ్స్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఆర్సీబీ టీములో విల్ జాక్స్ స్థానంలో గ్లెన్ మాక్స్‌వెల్‌ జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు
ఆర్సీబీ

ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, యష్ దయాల్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్

సీఎస్కే
రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, MS ధోని (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, మహేశ్ తీక్షణ

బెంగళూరులో సందడే సందడి..
IPL 2024 RCB vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కీలక మ్యాచ్ కోసం బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం రెడీ అయింది. చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీముల మధ్య జరిగే హై వోల్టేజ్ మ్యాచ్‌ వీక్షించేందుకు క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు చిన్న‌స్వామి స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. రెండు టీముల ఫ్యాన్స్ పోటెత్తడంతో స్టేడియం పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. బెంగళూరు నగరంలో ఎక్కడ చూసినా ఆర్సీబీ, సీఎస్కే అభిమానుల హంగామా కనిపిస్తోంది.

 

వరుణ దేవుడికి మొక్కులు
ఈ మ్యాచ్‌కు వ‌ర్షం అడ్డంగా మారే అవ‌కాశాలు ఉన్నాయని వార్తలు వచ్చినా ప్రస్తుతానికి అలాంటి సూచనలు కనబడకపోవడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఆకాశంలో మబ్బులు లేకపోవడంతో అభిమానులు మ్యాచ్‌ జరుగుతుందని ఆశాభావంతో ఉన్నారు. ఈ ఒక్కరాత్రికి రెస్ట్ తీసుకోవాలని వరుణ దేవుడికి మొక్కుతున్నారు.

 

Also Read: వ‌ర్షంతో 5 ఓవ‌ర్ల లేదా 10 ఓవ‌ర్ల మ్యాచ్ జ‌రిగితే.. ఆర్‌సీబీ ఎంత తేడాతో గెల‌వాలో తెలుసా?

సీఎస్కే ఫ్యాన్స్ హంగామా
ఎంఎస్ ధోని క్రేజ్ ఇప్పట్లో తగ్గేలా కనబడటం లేదు. మిస్టర్ కూల్ ఆట చూసేందుకు సీఎస్కే ఫ్యాన్స్ భారీ సంఖ్యలో చిన్న‌స్వామి స్టేడియానికి తరలివచ్చారు. ఆర్సీబీ హోంగ్రౌండ్ లో సీఎస్కే అభిమానుల హంగామా మామూలుగా లేదు.

 

ఆర్సీబీ ఫ్యాన్స్ బైక్ ర్యాలీ
హోంగ్రౌండ్ లో కీలక మ్యాచ్ ఆడబోతున్న ఆర్సీబీకి మద్దతుగా ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో చిన్న‌స్వామి స్టేడియానికి పోటెత్తారు. బెంగళూరు నగరంలో ఆర్సీబీ ఫ్యాన్స్ బైక్ ర్యాలీతో దుమ్ము రేపారు.

 

ట్రెండింగ్ వార్తలు