Immunity: కరోనా థర్డ్ వేవ్‌లో ప్రమాదం పిల్లలకే.. వారికోసం ఏం చెయ్యాలంటే?

సెకండ్ వేవ్‌లో కరోనా కారణంగా ఏన్నో కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి.. ఏన్నో మరణాలు.. ఎందరికో శోకాలు.. ఎట్టకేలకు కాస్త ఉపశమనం ఇస్తూ.. కరోనా తగ్గుముఖం పట్టింది. నాలుగు లక్షల కేసుల నుంచి లక్షన్నర కేసుల వరకు వచ్చేశాయి.

Kids immunity: సెకండ్ వేవ్‌లో కరోనా కారణంగా ఏన్నో కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి.. ఏన్నో మరణాలు.. ఎందరికో శోకాలు.. ఎట్టకేలకు కాస్త ఉపశమనం ఇస్తూ.. కరోనా తగ్గుముఖం పట్టింది. నాలుగు లక్షల కేసుల నుంచి లక్షన్నర కేసుల వరకు వచ్చేశాయి. ఇదిలా ఉంటే.. కరోనా థర్డ్ వేవ్ గురించి ఇప్పటినుంచే చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడవ దశలో ముఖ్యంగా పిల్లలకు ప్రమాదం అంటూ వస్తున్న నివేదికలు భయం పుట్టిస్తున్నాయి.

కరోనా వైరస్ లేదా మారుతున్న వాతావరణం వల్ల వచ్చే వ్యాధుల నుంచి పిల్లలను రక్షించడం చాలా ముఖ్యం కాగా.. చిన్న పిల్లల రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుందని, కాబట్టి ఏదైనా వైరస్ సంక్రమణ వారిని ప్రభావితం చేస్తుందని అంటున్నారు నిపుణులు. ఇటువంటి సమయంలో, పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పిల్లల ఆహారంలో మార్పులు చేయడం ద్వారా పిల్లల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయ్యాలని, తద్వారా

కాలానుగుణంగా పండ్లు-కూరగాయలు వారి ఆహారం మరియు పానీయాల ద్వారా పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. సీజనల్ పండ్లు, కూరగాయలను పిల్లల ఆహారంలో చేర్చాలని, ఇది వారి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని, వేసవిలో మామిడి, జామ, ఉసిరి, బ్రోకలీ మరియు పనసపండు వంటి వాటిని ఆహారం ఇవ్వాలి. ఈ పండ్లు పిల్లల రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పిల్లలకు నిమ్మకాయ ఊరగాయను కూడా భోజనంలో చర్చవచ్చు. పిల్లలు పుల్లని తీపి రుచిని ఇష్టపడతారు. వాటి వల్ల శక్తిని కూడా పొందుతారు.

ఆరోగ్యకరమైన అల్పాహారం- పిల్లలకు అల్పాహారంలో మాగీ, పాస్తా, బర్గర్ ఇచ్చే బదులు, ఇంట్లో వండిన మంచి ఆహారాన్ని ఇవ్వాలి. నెయ్యి, బెల్లం, రోటీ, హల్వా, గోధుమ పిండితో చేసిన వాటిని, డ్రైఫ్రూట్ లడ్డూలను ఇవ్వవచ్చు. శరీరంలో కార్టిసాల్ హార్మోన్ల స్థాయి తక్కువగా ఉంటుంది అందుకే పిల్లలకు బలం చేకూర్చడానికి ఈ రకమైన ఆహారం ఇవ్వవలసి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు