CBI Arrest: సీబీఐ ఏదైనా కేసు విషయంలో పీఎం, సీఎంలను నేరుగా అరెస్టుచేయొచ్చా.. అందుకు నిబంధనలు ఏమిటో తెలుసా?

క్రిమినల్ కేసుల్లో పార్లమెంట్, శాసనసభ, శాసన మండలి సభ్యుడిని అరెస్టు చేయొచ్చు. అయితే, ఆ సమాచారాన్ని స్పీకర్ లేదా చైర్మన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది.

CBI Arrest: ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం కేసు దేశాన్ని కుదిపేస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఈ కేసు ప్రభావం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కేసు విషయం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. తొమ్మిది గంటల పాటు 56 ప్రశ్నలు కేజ్రీవాల్‌పై సీబీఐ అధికారులు సంధించారు. సీబీఐ కార్యాలయంలో సీఎం కేజ్రీవాల్‌ను విచారిస్తున్న సమయంలో ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. అయితే, సీబీఐ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు రావడంతో ఆప్ కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమయింది. కానీ, తొమ్మిది గంటల విచారణ అనంతరం కేజ్రీవాల్ బయటకు వచ్చారు.

CM Kejriwal: కేజ్రీవాల్ కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన.. లిక్కర్ స్కాం నేపథ్యంలో సీఎం రాజీనామాకు డిమాండ్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు వ్యవహారంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు విచారించారు. అతన్ని అరెస్టు చేస్తారన్న వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో.. ఒకవేళ అవసరమైతే, సీబీఐ అధికారులు పీఎం, సీఎం స్థాయి వారిని అధికారులను నేరుగా అరెస్టు చేయొచ్చా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 135 ప్రకారం.. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ముఖ్యమంత్రి, శాసనసభ, శాసన మండలి సభ్యులకు అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ మినహాయింపు అన్ని కేసుల్లో కాదు, సివిల్ కేసుల్లో మాత్రమే. క్రిమినల్ కేసుల్లో ఈ సెక్షన్ వర్తించదు.

Delhi liquor scam: అందుకే విచారణ జరుపుతున్నారు.. నన్ను 56 ప్రశ్నలు అడిగారు: కేజ్రీవాల్

సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 135 ప్రకారం.. పార్లమెంట్, శాసన, శాసన మండలి సభ్యుడిని అరెస్టు చేయాలంటే, ఒకవేళ నిర్బదించాలంటే స్పీకర్, సభ‌చైర్మన్ నుండి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాక.. పార్లమెంటు ఆవరణం, శాసన సభ, శాసన మండలి ఆవరణాల్లో నుంచి ఏ సభ్యుడినికూడా అరెస్టు చేయటం, నిర్బంధించడం చేయొద్దనేది ఈ సెక్షన్ ద్వారా వర్తిస్తుంది.

Delhi liquor scam: 9 గంటల పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన సీబీఐ

క్రిమినల్ కేసుల్లో పార్లమెంట్, శాసనసభ, శాసన మండలి సభ్యుడిని అరెస్టు చేయొచ్చు. అయితే, ఆ సమాచారాన్ని స్పీకర్ లేదా చైర్మన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. పీఎం, సీఎంలుసైతం పార్లమెంట్, శాసన‌సభ‌ సభ్యులే కాబట్టి వారికికూడా ఇదే నియమం వర్తిస్తుంది. అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం.. రాష్ట్రపతి, గవర్నర్ విషయంలో పదవిలో ఉండగా నిర్భందించడం, అరెస్టు చేయడం సాధ్యం కాదు. వారికి వ్యతిరేకంగా ఏ కోర్టు కూడా ఎలాంటి ఆదేశాలు జారీ చేయదు. సివిల్, క్రిమినల్ కేసులలోనూ మినహాయింపు ఉంది. పదవిని వదిలిన తరువాత అతన్ని అరెస్టు చేయడం, నిర్బందించడం చేయొచ్చు.

ట్రెండింగ్ వార్తలు