Bigg Boss 5 : షణ్ముఖ్ ప్రియురాలితో సహా శ్రీరామచంద్రకు వెల్లువెత్తుతున్న సెలబ్రిటీల మద్దతు

శ్రీరామ్‌ కు రెండు అరికాళ్లకు కట్టు కట్టడంతో బెడ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. శ్రీరామ్ ఎమోషనల్ అయి బాధపడుతుండటంతో హౌస్ లోని మిగతా కంటెస్టెంట్స్ కూడా ఎమోషనల్........

Bigg Boss 5 :  బిగ్ బాస్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఎవరు ఫైనల్ కి వెళ్తారు అనే టాస్కులు జరుగుతున్నాయి. అయితే ఈ టాస్కుల వల్ల శ్రీరామచంద్ర గాయపడి మంచానికే పరిమితమయ్యాడు. టాస్క్ లో ఐస్ వాటర్ లో కాళ్ళు పెట్టడం వల్ల కాళ్ళు అన్ని తిమ్మిరి ఎక్కిపోయాయి అందరికి. ఐస్‌ వాటర్‌ నుంచి బయటకు రాగానే వేడినీళ్లు పోయడం హానికరమని ముందే వార్నింగ్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. శ్రీరామ్ ఎక్కువ సేపు ఐస్ వాటర్ లో ఉండటంతో కాళ్ళు బాగా తిమ్మిరెక్కాయి. దీంతో రాత్రి నిద్ర పోకుండా కాళ్ళ నొప్పులతో బాధపడుతుంటే ప్రియాంక… శ్రీరామ్ కాళ్లకు అర్ధరాత్రి జండూబామ్‌ రాసి కాళ్లపై వేడినీళ్లు పోసి మసాజ్‌ చేసింది. దీంతో అతడి కాళ్ళు వాచి నొప్పి మరింత ఎక్కువైంది. వెంటనే శ్రీరామ్‌ను మెడికల్‌ రూమ్‌లోకి పిలిచి మందులు రాసిచ్చారు.

Nikita Dutta : బాలీవుడ్ నటిపై దుండగుల దాడి… బయటకు వెళ్లాలంటేనే భయమేస్తుంది

ఇలా జరుగుతుందని ఊహించలేదని ప్రియాంక శ్రీరామ్‌కు క్షమాపణలు చెప్పింది. కానీ ఆమె చేసిన తప్పు వల్ల శ్రీరామ్‌ కు రెండు అరికాళ్లకు కట్టు కట్టడంతో బెడ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. శ్రీరామ్ ఎమోషనల్ అయి బాధపడుతుండటంతో హౌస్ లోని మిగతా కంటెస్టెంట్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. శ్రీరామ్ ని నవ్వించడానికి ట్రై చేశారు. ఇక శ్రీరామ్ అభిమానులు అతను త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Bigg Boss 5 : ప్రియాంక సింగ్‌కు తమన్నా సపోర్ట్.. ఏ ట్రాన్స్‌జెండర్ వల్ల ఇది సాధ్యం కాలేదు..

అభిమానులు, ప్రేక్షకులే కాకుండా శ్రీరామచంద్ర త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ కొందరూ సెలబ్రెటీలు కూడా శ్రీరామ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. షణ్ముఖ్‌ జశ్వంత్‌ ప్రియురాలు, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ దీప్తి సునయన శ్రీరామ్‌కు సపోర్ట్‌ గా తన సోషల్ మీడియాలో ‘మోర్‌ పవర్‌ టూ యూ’ అంటూ శ్రీరామ్‌కు మద్దతు ప్రకటించింది. అలాగే ఎలిమినేట్ అయిన ప్రియ ఇన్‌స్టాలో స్టోరీ షేర్‌ చేస్తూ ‘ఇంట్లో జెన్యూన్ పర్సన్ , రామ్ నీకోసం మేమంతా ఉన్నాము, ప్లే స్ట్రాంగ్, నీకోసం ప్రార్థిస్తుంటాను. నువ్వు త్వరగా కోలుకోవాలి’ అని శ్రీరామ్‌కు సపోర్ట్ చేసింది. వీరితో పాటు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ అఖిల్‌ సార్థక్‌, దేత్తడి హారికా, నోయల్‌ కూడా గెట్‌ వెల్‌ సూన్‌ అంటూ శ్రీరామ్ కు మద్దతు ఇస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు