Chiranjeevi – Ram Charan : కొరియన్ అంబాసడర్‌తో చిరు, చరణ్ భేటీ.. బంధాలు మరింత బలపడతాయి!

చిరంజీవి ఇంటిలో సౌత్ కొరియన్ అంబాసడర్ చాంగ్ జెబోక్ మరియు కొరియన్ ఎంబసి మెంబెర్స్ తో రామ్ చరణ్ భేటీ అయ్యాడు.

Chiranjeevi and Ram Charan meeting with South Korea Ambassador

Chiranjeevi – Ram Charan : మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ చరణ్.. మెగా ఇమేజ్ ని దాటి గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. RRR చిత్రంలో నటించి ఇంటర్నేషనల్ వైడ్ ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నాడు. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు పలు ప్రఖ్యాతి వేదికల పై స్థానం దక్కించుకుంటూ మరింత ఫేమ్ ని అందుకుంటున్నాడు. ఇక ఇటీవల కాశ్మీర్ శ్రీనగర్ లో జరిగిన G20 సమ్మిట్ కి రామ్ చరణ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ తరపున ప్రాతినిధ్యం వహించిన సంగతి అందరికి తెలిసిందే.

RRR : అక్కడ రిలీజ్‌కి సిద్దమవుతున్న ఆర్ఆర్ఆర్.. మరో కొత్త రికార్డులకు సిద్ధం!

ఆ కార్యక్రమంలో కొరియన్ ఎంబసి మెంబెర్స్ తో కలిసి నాటు నాటు స్టెప్ వేసి చరణ్ సందడి చేశాడు. తాజాగా వారితో కలిసి చిరంజీవి ఇంటిలో భేటీ అయ్యాడు. నిన్న సాయంత్రం సౌత్ కొరియన్ అంబాసడర్ చాంగ్ జెబోక్ మరియు కొరియన్ ఎంబసి మెంబెర్స్ తో.. చిరంజీవి అండ్ రామ్ చరణ్ టీ పార్టీలో పాల్గొన్నారు. ఇక ఆ విషయాన్ని తెలియజేస్తూ చిరు ఒక ట్వీట్ చేశాడు. G20 సమ్మిట్ లో చరణ్ కలిసి నాటు నాటు స్టెప్ వేసిన దగ్గర నుంచి చాంగ్ జెబోక్ ని కలవాలి అనుకుంటున్నట్లు, అది ఇప్పుడు జరిగినట్లు చెప్పుకొచ్చాడు.

Pawan Kalyan : నాకు జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం, ప్రభాస్ ఇష్టం.. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్!

అలాగే ఇండియా అండ్ కొరియా మధ్య బంధాలు మరింత బలపడడానికి ఇరు దేశాలు మధ్య ఇంటరాక్షన్ అండ్ కల్చర్ ఎక్స్‌చేంజ్ తప్పనిసరి అంటూ చెప్పుకొచ్చాడు. ఇరు దేశాల్లో సినిమా, మ్యూజిక్ అనేవి కామన్ డెవలప్ అవుతున్నాయని, ఇప్పటికే ఇండియన్స్ కొరియన్ పాప్ సాంగ్స్ అండ్ డ్రామాస్ ఇష్టపడుతున్నారని, ఇండియన్ మూవీస్ కూడా కొరియన్స్ లోకి మరింతగా వెళ్ళాలి అంటూ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశాడు. అలాగే ఆ మీటింగ్ కి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు