×
Ad

Mahesh Babu 25 Years : హీరోగా మహేష్ బాబుకి పాతికేళ్ళు.. హీరోగా మహేష్ పై ఫస్ట్ క్లాప్ కొట్టింది ఎవరో తెలుసా?

మహేష్ బాబు హీరోగా మొదటి సినిమా రాజకుమారుడు పూజా కార్యక్రమంలో మహేష్ పై క్లాప్ కొట్టింది ఎవరో తెలుసా?

  • Published On : July 30, 2024 / 05:01 PM IST

Mahesh Babu Completed 25 Years as Hero his first Movie Rajakumarudu Interesting Things

Mahesh Babu 25 Years : సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా దూసుకెళ్తున్నాడు. ఇన్నాళ్లు తెలుగు ప్రేక్షకులని మెప్పించిన మహేష్ త్వరలో రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులని మెప్పించబోతున్నాడు. ఇక అందంలో సూపర్ స్టార్ మహేష్ తో ఎవరూ పోటీపడలేరు. ఎంత ఏజ్ పెరిగినా అదే అందం మెయింటైన్ చేస్తూ ఇప్పటికి పాతికేళ్ల కుర్రాడిగానే కనిపిస్తాడు. అయితే మహేష్ హీరోగా కంటే ముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా కృష్ణతో కలిసి పలు సినిమాల్లో నటించాడు.

కానీ మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం రాజకుమారుడు సినిమాతోనే. ఈ సినిమా వచ్చి నేటికి పాతికేళ్ళు అవుతుంది. మహేష్ బాబు మొదట సినిమా రాజకుమారుడు 1999 జులై 30న రిలీజయింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మహేష్ బాబు, ప్రీతీ జింతా జంటగా వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినీదత్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. రాజకుమారుడు అప్పట్లో మంచి విజయం సాధించి 44 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ సినిమాని తర్వాత తమిళ్, హిందీలో కూడా రీమేక్ చేసారు.

Also Read : Alekhya Tarakaratna : విజయసాయి రెడ్డి ఫ్యామిలీతో తారకరత్న భార్య.. వైరల్ అవుతున్న ఫొటో..

మహేష్ మొదటి సినిమా రిలీజయి పాతికేళ్ళు అయిన సందర్భంగా మహేష్ అభిమానులు, పలువురు ప్రముఖులు మహేష్ కి అభినందనలు తెలుపుతున్నారు. అయితే మహేష్ బాబు హీరోగా మొదటి సినిమా రాజకుమారుడు పూజా కార్యక్రమంలో మహేష్ పై క్లాప్ కొట్టింది ఎవరో తెలుసా?

హీరోగా మహేష్ బాబుపై ఫస్ట్ క్లాప్ కొట్టింది సీఎం చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజకుమారుడు సినిమా 1998 ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజున పూజా కార్యక్రమాలు జరుపుకొని మొదలైంది. కృష్ణ – చంద్రబాబుకు మంచి స్నేహం ఉండటంతో కృష్ణ ఆహ్వానం మేరకు అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు సినిమా ఓపెనింగ్ కి గెస్ట్ గా వచ్చి మహేష్ హీరో అవ్వడానికి ఫస్ట్ క్లాప్ కొట్టారు. మళ్ళీ ఇప్పుడు మహేష్ హీరో అయిన పాతికేళ్ల తర్వాత కూడా చంద్రబాబు సీఎంగా ఉండటం విశేషం.