Tammareddy Bharadwaja : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ.. సీఎం అపాయింట్మెంట్ ట్రై చేసాం కానీ..

తాజాగా సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సీఎం వ్యాఖ్యలపై స్పందించారు.

Tammareddy Bharadwaja Reacts on CM Revanth Reddy Comments about Gaddar Awards

Tammareddy Bharadwaja – CM Revanth Reddy : గతంలో సినీ పరిశ్రమలో ప్రభుత్వం తరపున నంది అవార్డులు ఇచ్చేవాళ్ళు. కానీ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక ఎవరూ పట్టించుకోలేదు. దీనిపై పలువురు సినీ ప్రముఖులు నంది అవార్డులు ఇవ్వాలని పలుమార్లు మాట్లాడారు. అయితే తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇటీవల జనవరిలో ప్రతిష్టాత్మక నంది అవార్డులను గద్దర్ అవార్డుల పేరిట ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఆ కార్యక్రమాన్ని ఎలా చేయాలనే దానిపై అభిప్రాయాన్ని, సూచనలను అందించాలని తెలుగు సినీ పరిశ్రమను ముఖ్య‌మంత్రి కోరారు.

తాజాగా నేడు డాక్టర్‌ సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం ప్ర‌ధానోత్స‌వ‌ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గద్దర్ అవార్డులపై సినీ పరిశ్రమ మౌనంగా ఉండ‌డం ప‌ట్ల అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించిన‌ట్లుగా చెప్పారు. సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం బాధాకరమ‌న్నారు. దీంతో సీఎం వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారాయి.

Also Read : Mahesh Babu 25 Years : హీరోగా మహేష్ బాబుకి పాతికేళ్ళు.. హీరోగా మహేష్ పై ఫస్ట్ క్లాప్ కొట్టింది ఎవరో తెలుసా?

తాజాగా సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సీఎం వ్యాఖ్యలపై స్పందించారు. తమ్మారెడ్డి భరద్వాజ 10 టీవీతో మాట్లాడుతూ.. సీఎం గారి అపాయింట్మెంట్ కోసం మేము ట్రై చేసాం. ఫోన్లు చేసాము, స్పందన లేదు. మిస్ కమ్యూనికేషన్ అయి ఉంటుంది. ముఖ్యమంత్రి చెప్తే మేము చెయ్యకుండా ఉండము. నేను కలిసినప్పుడు కూడా ఈ అవార్డుల గురించి మాట్లాడారు. దానికి కావాల్సిన విధివిధానాలు రెడీ చేయమని చెప్పారు. గద్దర్ పేరు మీద అవార్డులు తీసుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రి ఎవర్ని వెళ్లి కలవమన్నా కలుస్తాం. నేను కొన్ని కాగితాలు రెడీ చేశాను, నర్సింగరావు గారు కూడా తయారుచేసారు. మేము ఇద్దరం ట్రై చేసాం కానీ అపాయింట్మెంట్ రాలేదు. ఆ తర్వాత ఛాంబర్ నుంచి కొంతమంది వెళ్లి సీఎంని కలిశారు. అప్పుడు కూడా ఈ అవార్డుల గురించి మాట్లాడారు. సీఎం గారి బిజీ, మిస్ కమ్యూనికేషన్ వల్ల మాత్రమే ఇది ముందుకు సాగలేదు. ఇప్పటికైనా సీఎం గారి ఆఫీస్ నుంచి పిలుపు వచ్చినా, ఎవర్ని అయినా కలవమని చెప్పినా వెళ్లి కలుస్తాం అన్నారు. మరి సినీ పరిశ్రమలోని మిగతా ప్రముఖులు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు