Alekhya Tarakaratna : విజయసాయి రెడ్డి ఫ్యామిలీతో తారకరత్న భార్య.. వైరల్ అవుతున్న ఫొటో..
తాజాగా వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఫ్యామిలీతో దిగిన ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అలేఖ్య రెడ్డి.
- Saketh U
- Published On : July 30, 2024 / 04:40 PM IST
Tarakaratna Wife Alekhya Reddy Shares a Photo with YCP Leader Vijayasai Reddy Family
Alekhya Tarakaratna – Vijayasai Reddy : నటుడు తారకరత్న గత సంవత్సరం మరణించిన సంగతి తెలిసిందే. తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన పిల్లల ఫొటోలు, తారకరత్న జ్ఞాపకాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఫ్యామిలీతో దిగిన ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అలేఖ్య రెడ్డి.
అలేఖ్య రెడ్డికి విజయ సాయి రెడ్డి బంధువు అవుతాడని తెలిసిందే. విజయ్ సాయి రెడ్డి భార్య అలేఖ్య రెడ్డికి పెద్దమ్మ అవుతుంది. అలేఖ్యకు విజయసాయి రెడ్డి పెదనాన్న అవుతారు. ఆ ఫ్యామిలీతో అలేఖ్యరెడ్డికి మంచి సంబంధం ఉంది. అలేఖ్య చిన్నప్పట్నుంచి విజయసాయి రెడ్డి ఇంట్లోనే ఎక్కువగా పెరిగింది. తారకరత్నతో లవ్ మ్యారేజ్ కూడా వీళ్ళే దగ్గరుండి చేసారు. తారకరత్న మరణించినప్పుడు కూడా విజయసాయి రెడ్డి వచ్చి దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు.
తాజాగా అలేఖ్య రెడ్డి విజయసాయి రెడ్డి ఫ్యామిలీతో దిగిన ఫొటో షేర్ చేసి.. హ్యాపీ బర్త్ డే బుజ్జి బాబు అని పోస్ట్ చేసి విజయసాయి రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది.
