Devara Song : ఎన్టీఆర్ ‘దేవర’ సెకండ్ సాంగ్ లిరిక్స్ లీక్ చేసేసిన లిరిసిస్ట్.. రొమాంటిక్ మెలోడీ రానుంది..
గత కొన్ని రోజులుగా దేవర సెకండ్ సాంగ్ రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.

Devara Second Song Lyrics Leaked by Lyricist song on NTR Janhvi Kapoor
Devara Song : ఎన్టీఆర్ దేవర సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా ఫుల్ మాస్ గా తెరకెక్కుతుంది. సెప్టెంబర్ 27న ఈ సినిమాని గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఒక మాస్ సాంగ్, గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
గత కొన్ని రోజులుగా దేవర సెకండ్ సాంగ్ రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ – జాన్వీ పై ఇటీవల థాయిలాండ్ వెళ్లి మరీ ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ని చిత్రీకరించారు. ఆ పాటే ఇప్పుడు రిలీజ్ కాబోతుందని సమాచారం. తాజాగా దేవరలో పాటలు రాసిన రామజోగయ్య శాస్త్రి తన ట్విట్టర్ లో.. ‘తంగం అంతరంగం.. హాయిగా.. ఉయ్యాలూగుతున్నట్టుంది..’ అనే లిరిక్స్ రాసి ఇప్పుడే విన్నాను. త్వరలోనే వచ్చేస్తుందిలే అని పోస్ట్ చేసారు.
Also Read : Pawan Kalyan – Purnaa : పవన్ కళ్యాణ్‌తో ఒక్క ఫోటో ఇప్పించు ప్లీజ్.. నిహారికని బతిమాలుకున్న హీరోయిన్..
ఆ లిరిక్స్ చూస్తుంటే రొమాంటిక్ మెలోడీ సాంగ్ ఎన్టీఆర్, జాన్వీలపై ఉండే సాంగ్ అని అర్ధమవుతుంది. ఈ సినిమాలో జాన్వీ క్యారెక్టర్ పేరు తంగం అని గతంలో జాన్వీ పోస్టర్ రిలీజ్ చేసినపుడు చెప్పారు. తంగం అంటే బంగారం అని అర్థమట. ఇప్పుడు తంగం అంటూనే సాంగ్ రాసుకున్నారు. ఈ సాంగ్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తునారు. అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్న సంగతి తెలిసిందే.
తంగం అంతరంగం…..
హాయిగా…..
ఉయ్యాలూగుతున్నట్టుంది….
ఇప్పుడే విన్నా…
త్వరలోనే వచ్చేస్తుందిలే…
శుభోదయం❤️
Worth d wait Varmaa?
— RamajogaiahSastry (@ramjowrites) July 29, 2024