Pawan Kalyan – Purnaa : పవన్ కళ్యాణ్‌తో ఒక్క ఫోటో ఇప్పించు ప్లీజ్.. నిహారికని బతిమాలుకున్న హీరోయిన్..

హీరోయిన్ పూర్ణ పవన్ కళ్యాణ్ తో ఫోటో ఇప్పించమని నిహారికని రిక్వెస్ట్ చేసింది.

Pawan Kalyan – Purnaa : పవన్ కళ్యాణ్‌తో ఒక్క ఫోటో ఇప్పించు ప్లీజ్.. నిహారికని బతిమాలుకున్న హీరోయిన్..

Actress Purnaa Request Niharika for A Photo with Pawan Kalyan

Updated On : July 30, 2024 / 2:55 PM IST

Pawan Kalyan – Purnaa : పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. మాములు జనాల్లోనే కాదు సెలబ్రిటీల్లో కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల జనసేన గెలిచినప్పుడు కూడా సినీ పరిశ్రమలోని చాలా మంది సెలబ్రిటీలు పవన్ కి అభినందనలు తెలుపుతూ పోస్టులు చేసారు. కొంతమంది స్వయంగా పవన్ ని కలిసి అభినందించారు.

ఓ హీరోయిన్ పవన్ కళ్యాణ్ తో ఫోటో ఇప్పించమని నిహారికని రిక్వెస్ట్ చేసింది. నిహారిక తాజాగా డ్రామా జూనియర్స్ షోకి గెస్ట్ గా వచ్చింది. ఈ షోలో పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర పై పిల్లలు అదిరిపోయే స్కిట్ వేశారు. ప్రస్తుతం ఈ స్కిట్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. అయితే ఈ స్కిట్ అయ్యాక ఈ షోకి ఒక జడ్జిగా చేస్తున్న నటి పూర్ణ నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Also Read : Mahesh Babu : ధ‌నుష్ ‘రాయ‌న్’ మూవీపై సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు రివ్యూ..

ఒకప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేసి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు, ఇలా టీవీ షోలు చేస్తుంది పూర్ణ. డ్రామా జూనియర్స్ షోలో పవన్ కళ్యాణ్ పై స్కిట్ అయ్యాక చివర్లో పూర్ణ మాట్లాడుతూ.. నాకు పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం. ప్లీజ్ నిహారిక ఒక్కసారి ఎప్పుడైనా నాకు ఆయనతో ఒక్క ఫోటో ఇప్పించు అని రిక్వెస్ట్ చేసింది. దీంతో పూర్ణ వైరల్ గా మారింది. మాములు జనాలే ఆయన్ని చూస్తే చాలు, ఫోటో అయితే ఇంకా అదృష్టమే అనుకుంటే ఇక్కడ సెలబ్రిటీలు కూడా ఫోటో కోసం రిక్వెస్ట్ చేస్తున్నారంటే పవన్ ఎంత గ్రేట్ అనేది మరోసారి అర్ధం అవుతుంది.