×
Ad

Raj Tarun – Malvi Mlahotra : రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా బయటకి వస్తారు.. ప్రెస్ మీట్ పెడుతున్నాం..

లావణ్య వివాదం మొదలయినప్పటి నుంచి రాజ్ తరుణ్ - మాల్వి మల్హోత్రా అసలు మీడియా ముందుకు రావట్లేదు.

  • Published On : July 30, 2024 / 03:17 PM IST

Raj Tharun and Malvi Malhotra will come to Movie Promotions and Face the Media after Lavanya Issue

Raj Tarun – Malvi Mlahotra : ఇటీవల గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. లావణ్య అనే ఓ యువతి.. రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకొని, నాతో పదేళ్లు ప్రేమలో ఉండి, అబార్షన్ చేయించి ఇప్పుడు వదిలించుకుందామని చూస్తున్నాడు, హీరోయిన్ మాల్వి మల్హోత్రాని పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఆరోపణలు చేస్తూ రాజ్ తరుణ్ పై, హీరోయిన్ మాల్వి మల్హోత్రాలపై కేసు పెట్టింది.

దీంతో రాజ్ తరుణ్ ఒకే ఒక్కసారి మీడియా ముందుకు వచ్చి ఆమెతో నాకు ఎప్పుడో బ్రేకప్ అయింది, ఆమెవన్నీ అబద్దపు ఆరోపణలు అని చెప్పి కనిపించకుండా వెళ్లిపోయాడు. మాల్వి కూడా లావణ్యపై కేసు పెట్టింది. ఈ వివాదం మొదలయినప్పటి నుంచి రాజ్ తరుణ్ – మాల్వి మల్హోత్రా అసలు మీడియా ముందుకు రావట్లేదు.

Also Read : Pawan Kalyan – Purnaa : పవన్ కళ్యాణ్‌తో ఒక్క ఫోటో ఇప్పించు ప్లీజ్.. నిహారికని బతిమాలుకున్న హీరోయిన్..

ఇటీవలే జులై 26న రాజ్ తరుణ్ హీరోగా చేసిన పురుషోత్తముడు సినిమా రిలీజ్ అయినా ఆ సినిమా ఈవెంట్స్ కి, ప్రమోషన్స్ కి కూడా రాజ్ తరుణ్ రాలేదు. ఇప్పుడు రాజ్ తరుణ్ మరో సినిమా రిలీజ్ కాబోతుంది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా జంటగా నటించిన తిరగబడరా సామీ సినిమా ఆగస్టు 2 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కి కూడా రాజ్ తరుణ్ రావట్లేదు.

తాజాగా ఈ సినిమా నిర్మాత మల్కపురం శివ మీడియాతో మాట్లాడగా అందరూ ఈ సినిమాకి కూడా రాజ్ తరుణ్ ప్రమోషన్స్ కి రాడా? హీరోయిన్ కూడా రాదా? అని అడిగారు. దీనికి నిర్మాత మల్కపురం శివ మాట్లాడుతూ.. అందరూ వస్తారు. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కూడా ప్రమోషన్స్ కి వస్తారు. రేపు లేదా ఎల్లుండి ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము. ఆ ప్రెస్ మీట్ కి హీరోతో సహా అందరూ వస్తారు అని తెలిపారు. మరి రాజ్ తరుణ్ నిజంగానే బయటకి వచ్చి ప్రెస్ మీట్ కి వస్తారా? ప్రెస్ మీట్ కి వస్తే మీడియాని ఫేస్ చేస్తారా చూడాలి.