Adhir Ranjan Chaudhary – Randeep Surjewala: ఆ పనేదో ముందే చేసిఉంటే ఇతంటి ఘోరం జరిగేది కాదు.. మోదీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రశ్నలు

రైలు ప్రమాదంపై కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా, అధీర్ రంజన్ చౌదరి ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో రైల్వే మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Odisha Train Accident: ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాద ఘటనా స్థలిలో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. సుమారు 500 మీటర్ల మేర రైల్వే‌శాఖ కొత్త ట్రాక్ ఏర్పాటు చేస్తుంది. పునరుద్ధరణ పనుల్లో వెయ్యి మందికి‌పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. ఏడు పొక్లెయిన్లు, రెండు యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లు, మూడు నుంచి నాలుగు రైల్వే, రోడ్ క్రేన్లు మోహరించి మరమ్మతు పనులు చేస్తున్నారు. పట్టాలు తప్పిన భోగీలను ట్రాక్‌పై నుంచి తొలగించి కొత్త పట్టాలు, ఎలక్ట్రిఫికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర రైల్వే శాఖ అధికారులు రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పర్యవేక్షించారు.

Ashwini Vaishnav: ప్రమాద ఘటనకు గల కారణాలు.. అందుకు బాధ్యులైన వ్యక్తులను గుర్తించాం.. బుధవారం ఉదయం వరకు రైళ్ల రాకపోకలు

ఇదిలాఉంటే రైలు ప్రమాదం వివరాలు, పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే మాజీ రైల్వేశాఖ సహాయ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, AICC ఇన్‌చార్జ్ చెల్లా కుమార్‌లను నియమించిన విషయం విధితమే. ఈ సందర్భంగా వారు రైలు ప్రమాద స్థలిలో జరుగుతున్న సహాయక చర్యలు, మరమ్మతు పనులను పర్యవేక్షించారు. అనంతరం అధీర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. ప్రమాద ఘటన తరువాత పునరుద్ధరణ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయత్నాలు జరగడం లేదని నేను చెప్పడం లేదు, కానీ ప్రమాదం తర్వాత ఇదంతా చేస్తున్నారు. ఘటనకు ముందే భద్రతా సంసిద్ధత కనబరిచి ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగి ఉండేది కాదు అని అధీర్ రంజన్ చౌదరి అన్నారు.

Ashwini Vaishnav : రైలు ప్రమాదాల నివారణ.. రెండు రైళ్లు ఢీకొట్టకుండా ఆపేసిన రైలు రక్షణ వ్యవస్థ కవచ్‌

మరోవైపు రైలు ప్రమాదంపై కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో రైల్వే మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యం కారణంగా రైలు ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యం‌పై ఇచ్చిన క్లిష్టమైన హెచ్చరికను రైల్వే మంత్రి, రైల్వే మంత్రిత్వ శాఖ పట్టించుకోలేదు. ఈ విషయం గురించి రైల్వే మంత్రికి, రైల్వే మంత్రిత్వ శాఖకు ఎందుకు తెలియలేదు? ఎందుకు అజాగ్రత్తగా ఉన్నారని ప్రశ్నించారు. రైల్వే మంత్రి రైలు భద్రతపై దృష్టి సారించడం కంటే మార్కెటింగ్, ప్రధాన మంత్రి మోదీని సంతోషపెట్టడంపైనే ఎక్కువ శ్రద్ద చూపుతున్నారనేది నిజంకాదా? అని రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు.

Odisha Train Accident : కోరమాండల్, యశ్వంత్‌పూర్ హౌరా రైళ్లలో లభ్యంకాని 141 మంది ఏపీ ప్రయాణీకుల ఆచూకీ

కవచ్ యాంటీ – కొలిజన్ సిస్టమ్ ను అమలు చేస్తున్నారా? రాష్ట్రీయ రైల్ సంరక్ష కోష్ (ఆర్ఆర్ఎస్‌కే)లో నిధులను కేటాయిస్తున్నారా? రైల్వేలో మూడు లక్షలకుపైగా ఉన్న ఖాళీలను భర్తీచేస్తున్నారా? దేశ ప్రజలు సమాధానం కోరుతున్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ఒడిశా రైలు ప్రమాద ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కవచ్ వ్యవస్థకేవలం ప్రధానికి మాత్రమే ఉందని, దేశ ప్రజలు, సైన్యం, రైల్వే ప్రయాణికులకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు