MLA Jaggareddy : కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు ఎక్కడ ఉండేవాడివి : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

తెలంగాణ వచ్చాక ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించినవో చెప్పాలన్నారు. జీవితాంతం సోనియా రాహుల్ కాళ్లు కడిగి, నీవు నీళ్లు చల్లుకోవాలని సూచించారు.

MLA Jaggareddy : టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు చేశారు. తెలంగాణ తొలి ఉద్యమం జరిగినప్పుడు బాల్క సుమన్ చిన్నపిల్లోడు అని అన్నారు. మొదటి ఉద్యమం సమయంలో గోటీలు ఆడుకునేవాడని తెలిపారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు ఎక్కడ ఉండేవాడివి అని సుమన్ కు చురకు అంటించారు. వార్డు మెంబర్ కు కూడా పనికిరాని నువ్వు గాలికి ఎమ్మెల్యే అయ్యావని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పే రోజు నీది.. ఎమ్మెల్యే అవ్వగానే పెద్దోడివి అనుకుంటున్నవా అని మండిపడ్డారు. మీడియా ముందుకు రాగానే చూసి మాట్లాడలని సూచించారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే నువ్వు ఎం చేస్తున్నావ్ ? ఎందుకు ఆపలేకపోయినవ్ అని ప్రశ్నించారు. ఆ శవాల మీద నువ్వు ఎంపీ అయ్యావ్, ఎమ్మెల్యే అయ్యావ్, కోటీశ్వరుడు అయ్యావ్ అని ఆరోపించారు.

Jaggareddy : విద్యార్థులు ప్రాణాలు కోల్పోవద్దని సోనియా తెలంగాణ ఇచ్చారు : జగ్గారెడ్డి

తెలంగాణ వచ్చాక ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించినవో చెప్పాలన్నారు. జీవితాంతం సోనియా రాహుల్ కాళ్లు కడిగి, నీవు నీళ్లు చల్లుకోవాలని సూచించారు. రాజకీయం కోసం రాహుల్ ఓయూకు రావట్లేదని స్పష్టం చేశారు. బాల్క సుమన్ ప్రెస్ మీట్ కి వచ్చేముందు ఏం మాట్లాడాలో కేసీఆర్ ట్రైనింగ్ ఇవ్వాలని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు