Asaduddin Owaisi Casts his Vote (Photo: @ANI)
Asaduddin Owaisi Casts Vote: మోదీ అంటే మొత్తం భారత దేశం కాదు.. రాజకీయ నాయకుల కంటే దేశం గొప్పదని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. లోక్‌సభ నాలుగో విడత ఎన్నికల పోలింగ్ లో భాగంగా ఆయన పాతబస్తీ వట్టేపల్లిలో ఓటువేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తులకంటే దేశం గొప్పదని అందుకే ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరారు. ప్రజాస్వామ్య భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విన్నవించారు.
ఈ ఎన్నికలు దేశానికి ఎంతో చారిత్రాత్మకం. ప్రజలు బీజేపీ, మోదీ ఐడియాలజీని నమ్మడంలేదు. మోదీ అధికారంలోకి వస్తే.. సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, రైల్వే ఫోర్స్ లను కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలుగా మార్చేస్తారు. మోదీ సర్కార్ అగ్నివీర్‌తో ఆర్మీని నిర్వీర్యం చేసింది. నేను భారత జాతీయ వాదిని. మోదీ గెలుస్తారో, లేదో తెలియదు. మళ్లీ పార్లమెంట్‌కు వస్తారో రారో కూడా తెలియదు. మోదీ 400 సీట్లు వెనుక.. రాజ్యాంగం, రిజర్వేషన్ లను మార్చే కుట్ర ఉందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
కాగా, హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాధవీలత సికింద్రాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస యాదవ్ పోటీ చేస్తున్నారు.
#WATCH | Telangana: AIMIM candidate from Hyderabad, Asaduddin Owaisi casts his vote at a polling booth in Hyderabad.
He faces BJP’s Madhavi Latha and BRS’ Gaddam Srinivas Yadav here. #LokSabhaElections2024 pic.twitter.com/5aPQIFR0zy
— ANI (@ANI) May 13, 2024