Controversial JNU circular : బోయ్ ఫ్రెండ్స్ విషయంలో..వివాదంగా జేఎన్‌యూ సర్క్యులర్..

బోయ్ ఫ్రెండ్స్ విషయంలో.. అమ్మాయిలు ఎలా ఉండాలో అనే విషయంపై జేఎన్‌యూ సర్క్యులర్ వివాదంగా మారింది.

Controversial JNU circular on sexual harassment : ఢిల్లీలోని జవహర్‌లాల్ యూనివర్సిటీ (JNU) జారీ చేసిన ఓ సర్క్యులర్ వివాదంగా మారింది.అమ్మాయిలపై లైంగిక వేధింపుల విషయంలో JNU అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) జారీ చేసిన సర్క్యులర్‌పై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అమ్మాయిలు తమపై జరుగుతున్న లైంగిక వేధింపుల నుంచి ఎలా బయటపడవచ్చో సూచిస్తూ జారీ చేసిన ఆ సర్క్యులర్‌ను జేఎన్‌యూ తన వెబ్‌సైట్‌లో పెట్టింది. దీనిపై విద్యార్ధి సంఘాలేకాకుండా జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్రంగా స్పందించింది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ జేఎన్ యూ సర్క్యులర్ ను తీవ్రంగా తప్పుబట్టారు.

Read more : Mark Zuckerberg: వ్యవసాయంలోకి మార్క్ జూకర్‌బర్గ్, రూ.127కోట్లతో స్థలం కొనుగోలు

సర్య్యులర్ లో ‘‘అబ్బాయిలు కొన్నిసార్లు అనుకోకుండా, మరికొన్ని సార్లు కావాలని..ఉద్దేశపూర్వకంగా..స్నేహంగా ఉంటునే జోక్ అన్నట్లుగా అమ్మాయిలపై లైంగిక వేధింపులు చేస్తుంటారని..అబ్బాయిలు ఆ మధ్య ఉన్న సన్నని గీతను దాటుతారని..ఇటువంటి వేధింపులకు దూరంగా ఉండటానికి అమ్మాయిలు తమకు, తమ మగ స్నేహితుల (బోయ్ ఫ్రెండ్స్)కు మధ్య ఒక స్పష్టమైన గీతను ఎలా గీయాలో తెలుసుకోవాలని ఆ సర్క్యులర్‌లో పేర్కొంది.

Read more : Vangaveeti Radha: వంగవీటి రాధాకు చంద్రబాబు ఫోన్.. పోరాడుదాం!

వర్శిటీ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఈ సర్క్యులర్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీనిపై విద్యార్ధి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ మంగళవారం (డిసెంబర్ 28,2021)మాట్లాడుతు..ఈ సర్క్యులర్ స్త్రీ ద్వేషపూరిత సర్క్యులర్‌గా ఉందని అన్నారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇటువంటి సలహాలన్నీ అమ్మాయిలకే ఎందుకు ఇస్తారు? అని ప్రశ్నించారు.

ట్రెండింగ్ వార్తలు