Adipurush : నేపాల్‌లో ఆదిపురుష్ వివాదం.. డైలాగ్ తీసేయాలంటూ నేపాల్ నేతలు.. అసలు ఏమైంది?

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా నేడు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని ఒక డైలాగ్ నేపాల్ లో వివాదం రేపింది.

controversy on Prabhas Adipurush movie in nepal country

Prabhas Adipurush : బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో రామాయణ కథాంశంతో ప్రభాస్ రాముడిగా కనిపిస్తూ చేసిన సినిమా ఆదిపురుష్. కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా నటించిన ఈ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 6200 థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఇండియాలోనే దాదాపు 4000 పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యినట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమా నేపాల్ (Nepal) కూడా రిలీజ్ అయ్యింది.

Adipurush : ఆదిపురుష్ చూసేందుకు వచ్చిన హనుమాన్.. వీడియో వైరల్!

అయితే ఈ చిత్రం అక్కడ వివాదం అయ్యింది. ఆదిపురుష్ సినిమాలో సీత మాత భారత్ లో జన్మించినట్లు డైలాగ్ ఉంది. చరిత్ర ప్రకారం సీత మాత నేపాల్ లో జన్మించారని, ఆ డైలాగ్ ని తీసేయకుంటే సినిమా విడుదలకు అనుమతి ఇవ్వమంటూ నేపాల్ సెన్సార్ బోర్డ్ స్పష్టం చేసింది. ఇక ఈ డైలాగ్ పై నేపాల్ నేతలు కూడా మండిపడుతున్నారు. దీంతో చిత్ర యూనిట్ సినిమాలోని ఆ డైలాగ్ ని తొలిగించి రిలీజ్ కి లైన్ క్లియర్ చేసుకున్నారు. కానీ ఈరోజు మార్నింగ్ షోలను పలువురు నిలిపివేసినట్లు తెలుస్తుంది.

Adipurush : మీకు ఇది తెలుసా..? ఆదిపురుష్‌కి 1992లో వచ్చిన యానిమేషన్ రామాయణం ఆధారమట..

ఇక సినిమా టాక్ విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి అంటున్నారు. సెకండ్ హాఫ్ కొంచెం లెంగ్తీగా ఉన్నా యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయని చెబుతున్నారు. సినిమాలో రాముడు మరియు రావణాసురుడి ఎంట్రీ గూస్‌బంప్స్ వచ్చేలా చేస్తాయట. అలాగే హనుమాన్ సంజీవని తెచ్చే సీన్, లంకాదహనం సీన్స్ అదిరిపోయిని అని టాక్. అలాగే శబరి మరియు సుగ్రీవుడుతో రాముడు సన్నివేశాలు అయితే ఎమోషనల్ గా ఉన్నాయని చెబుతున్నారు. ఇక గ్రాఫిక్స్ విషయానికి వస్తే.. మూవీలోని కొన్ని చోట్ల VFX వర్క్ సెట్ అవ్వలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు