Adipurush : మీకు ఇది తెలుసా..? ఆదిపురుష్‌కి 1992లో వచ్చిన యానిమేషన్ రామాయణం ఆధారమట..

ప్రభాస్ ఆదిపురుష్ సినిమాని 1992లో వచ్చిన యానిమేషన్ రామాయణం ఆధారంగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించాడట. ఆ సినిమా చూసి..

Ramayana The Legend of Prince Rama is the inspiration of Prabhas Adipurush

Prabhas Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ కోసం చూసిన ఎదురు చూపులకు ఇక తెరపడింది. ఈ చిత్రం నేడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. రామాయణ కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut) ఈ సినిమాని తెరకెక్కించాడు. అయితే ఈ దర్శకుడు అంతకుముందు తెరకెక్కించిన సినిమాలు ఏంటి? ఆదిపురుష్ తెరకెక్కించాలి అనే స్ఫూర్తి తనకి ఎక్కడ నుంచి వచ్చిందో ఇక్కడ తెలుసుకోండి.

Adipurush : ఆదిపురుష్ విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి..? గ్రాఫిక్స్ గురించి ఆడియన్స్ ఏమంటున్నారు..?

ఓం రౌత్ దర్శకుడిగా తెరకెక్కించింది ఇప్పటివరకు మూడు సినిమాలు. మొదటి సినిమాని ఫ్రీడమ్ ఫైటర్ అయిన బాలగంగాధర తిలక్ కథ ఆధారంగా “లోకమాన్య : ఏక్ యుగ్ పురుష్” పేరుతో మరాఠీలో తెరకెక్కించాడు. ఆ తరువాత ‘తానాజీ’ అంటూ మరో లైఫ్ స్టోరీతోనే ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ మూవీ తరువాత చేసినదే ఆదిపురుష్. అందరికి తెలిసిన రాముడి కథని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించే ప్రయత్నంతో ఈ సినిమాని తెరకెక్కించాడు.

Adipurush : ఆదిపురుష్‌లో తండ్రి కొడుకులుగా ప్రభాస్.. వైరల్ అవుతున్న ఫోటో!

కాగా ఓం రౌత్ కి ఆదిపురుష్ తెరకెక్కించాలనే ఆలోచన.. ఒక యానిమేషన్ మూవీ వల్ల వచ్చిందట. 1992లో రిలీజ్ అయిన “రామాయణ : ది లెజెండ్ అఫ్ ప్రిన్స్ రామ” యానిమేటెడ్ మూవీ చూసిన ఓం రౌత్.. అదే చిత్రాన్ని రియల్ క్యారెక్టర్స్ పెట్టి మోషన్ క్యాప్చర్ 3D ఫిలింగా తెరకెక్కించాలని ఆదిపురుష్ ని సిద్ధం చేశారు. ఇక ఈ మూవీ VFX విషయంలో యానిమేటెడ్ బొమ్మల ఉన్నాయి అంటూ భారీ ట్రోలింగ్ ఎదురుకున్న సంగతి తెలిసిందే. అయితే చిత్ర యూనిట్ మళ్ళీ రీ వర్క్ కి వెళ్లి మరో 100 కోట్లు ఖర్చు చేసి సాధ్యమైనంత బెటర్ వర్క్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు.

 

 

ట్రెండింగ్ వార్తలు