Adipurush : ఆదిపురుష్ విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి..? గ్రాఫిక్స్ గురించి ఆడియన్స్ ఏమంటున్నారు..?

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా VFX విషయంలో భారీ ట్రోలింగ్ ఎదురుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

Prabhas Kriti Sanon Adipurush VFX works quality report and review

Prabhas Adipurush : రామాయణ కథాంశంతో ప్రభాస్ రాముడిగా తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎన్నో అడ్డంకులు దాటుకొని నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇండియా వైడ్ ఈ చిత్రం అత్యధిక థియేటర్స్ లో 4000 పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది. యూఎస్ ప్రీమియర్స్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మార్నింగ్ బెన్ఫిట్ షోలు పడ్డాయి. ఇక ఈ మూవీ చూసిన కొందరు ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.

Adipurush : ఆదిపురుష్‌లో తండ్రి కొడుకులుగా ప్రభాస్.. వైరల్ అవుతున్న ఫోటో!

ఈ క్రమంలోనే మూవీలోని విజువల్ ఎఫెక్ట్స్ గురించి కూడా ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ సమయంలో VFX వర్క్స్ గురించి భారీ ట్రోలింగ్ ని ఎదురుకున్న విషయం తెలిసిందే. దీంతో రీ వర్క్ కోసం వెనక్కి వెళ్లి మరో 100 కోట్లు ఖర్చు చేసి బెటర్ వెర్షన్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. మూవీ నుంచి రిలీజ్ చేసిన రెండు ట్రైలర్స్ లో గ్రాఫిక్ వర్క్ అందర్నీ ఓకే అనిపించినప్పటికీ సినిమాలో ఎలా ఉండబోతుందో అని అందరిలో ఆసక్తి నెలకుంది. ఇక మూవీ చూసిన ఆడియన్స్ VFX వర్క్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండు అనిపించింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందో తెలుసా..?

మూవీలోని కొన్ని చోట్ల గ్రాఫిక్ వర్క్స్ చాలా బాగున్నాయట. కానీ కొన్ని చోట్ల మాత్రం పెద్దగా ఆకట్టుకునేలా లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ గ్రాఫిక్స్ 2D వెర్షన్ లో కంటే 3D వెర్షన్ లో చాలా బాగున్నాయని. ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరెన్స్ ఇస్తున్నాయని, సాధ్యమైతే 3D లో మూవీ చూడమని కొంతమంది ఆడియన్స్ సలహా ఇస్తున్నారు. ఇక స్క్రీన్ ప్లే పరంగా సినిమాని దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేసినట్లు, రాముడు-రావణాసురుడి ఎంట్రీ, శబరి మరియు సుగ్రీవుడుతో రాముడు సన్నివేశాలు హనుమాన్ సంజీవని అండ్ లంకాదహనం సీన్స్ హైలైట్స్ అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు