Building Collapse:ఢిల్లీలో కుప్ప‌కూలిన నాలుగు అంతస్తుల భ‌వ‌నం..శిథిలాల కింద ప్రాణాలు..!

దేశ రాజ‌ధాని ఢిల్లీలో నాలుగు అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. మల్కా గంజ్ సమీపంలోని స‌బ్జి మండి ఏరియాలో కూలిన శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించే యత్నాలు కొనసాగుతున్నాయి.

Building Collapse In Delhi : దేశ రాజ‌ధాని ఢిల్లీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఢిల్లీలోని మల్కా గంజ్ సమీపంలోని స‌బ్జి మండి ఏరియాలో ఈ ప్ర‌మాదంలో కూలిన శిథిలాల కింద ఎన్నో ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ ప్ర‌మాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయం చర్యల్ని చేపట్టాయి.ఇప్పటికే శిథిలాల కింద నుంచి తీవ్రంగా గాయ‌ప‌డిన ఓ వ్య‌క్తిని వెలికి తీసి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని ర‌క్షించ‌డానికి స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

Read more : Fire Accident: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

స్థానిక పోలీసులతో పాటు ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు, జాతీయ విప‌త్తు నిర్వ‌హ‌ణ ద‌ళం అధికారులు సంయుక్తంగా రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ఈ విషయాన్ని ఢిల్లీ జాయింట్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ ఎన్ఎస్ బుందేలా వెల్లడింయారు. శిథిలాల కింద ఎంత మంది ఉండ‌వ‌చ్చ‌నే వివ‌రాలు తెలియ‌డానికి మ‌రికొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కైతే త‌ల‌కు తీవ్ర గాయ‌మైన ఓ వ్య‌క్తిని ర‌క్షించి ఆస్ప‌త్రికి త‌ర‌లించార‌ని చెప్పారు.అతనికి చికిత్స కొనసాగుతోందని తెలిపారు.ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Read more : Fire Accident : ఢిల్లీ షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

ఈ ప్రమాద ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్ సమీక్షిస్తున్నారు. ప్రతీ క్షణం అక్కడ జరుగుతున్న సహాయక కార్యక్రమాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై దిగ్ర్భాంతిని వెల్లడించిన సీఎం ఈ ప్రమాదం చాలా బాధాకరం అని..అన్నారు.కాగా..భవనం కూలిపోవడానికి కారణం ఏమిటో ఇంకా నిర్ధారించలేదని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు.అయితే.. నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు భవనం నిర్మాణాన్ని బలహీనపరిచే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఈ కారణంగా అనేక ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు