MIT Awards : యాప్ క్రియేట్ చేసిన 6th క్లాస్ పిల్లాడికి ఎంఐటీ అవార్డు

6వ తరగతి చదివే పిల్లాడు సొంతంగా ఓ యాప్ తయారుచేసి ఎంఐటీ అవార్డు అందుకున్నాడు.

MIT Awards Class 6 Indian Student Pranet Pahwa :  6వ తరగతి చదివే విద్యార్ధి. స్కూలుకెళ్లాలంటే నాన్న తోడు ఉండాలని పేచీ పెట్టే పిల్లాడు ఏకంగా సొంతంగా ఓ యాప్ తయారుచేసి అవార్డు గెలుచుకున్నాడు. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని శివ్ నాడార్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. ఈ పిల్లాడు ఓ యాప్ త‌యారు చేసి.. ఎంఐటీ అవార్డు అందుకొన్నాడు. ఢిల్లీకి చెందిన ప్రనేత్ పహ్వా అనే బాలుడు ఎన్‌సీఆర్‌లోని శివ్ నాడార్ స్కూల్ 6th క్లాస్ చదువుతున్నాడు. ప్రనేత్ సొంతంగా యాప్ క్రియేట్ చేసి శెభాష్ అనిపించుకున్నాడు.

ఈ ఘనత సాధించినందుకు ఎంఐటీ నుంచి అవార్డు గెలుచుకున్నాడు. ప్రనేథ్ పహ్వా అమెరికాలోని మ‌సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వ‌హిస్తున్న ఎంఐటీ యాప్ ఇన్వెంట‌ర్ అపాథాన్ ఫ‌ర్ గుడ్ 2021 పోటీల్లో పాల్గొన్నాడు. ఈ పోటీల్లో ‘హీల్ ది వరల్డ్’ (‘Heal the World’) అనే యాప్‌ను రూపొందించాడు. దీంతో ప్రనేత్ ప్రతిభను గుర్తించిన మ‌సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT యాప్ ఇన్వెంటర్ అపాథాన్ తో పాటు ఫుల్ ఛాయిస్ యూత్ టీమ్‌కు విజేత నిలిచాడు.

ప్రనేత్ కు ముందు నుంచి కోడింగ్ అంటే ఇష్టం. చాలా ఇంట్రెస్ట్ గా వాటిని నేర్చుకునేవాడు. వాటిపై ఉండే ఆస‌క్తి తో ఎన్నో నేర్చుకున్నాడు. అలా భార‌త్ అంతా క‌రోనాతో పోరాడుతున్న సమయంలో ప్రనేత్ మాత్రం ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కరోనా సమయంలో లాక్ డౌన్ ఉన్న క్రమంలో ఆరోగ్య నిపుణులను సులభంగా గుర్తించడంలో ప్రజలకు సహాయపడటానికి ‘XDOC+’ అనే హెల్త్‌కేర్ యాప్‌ (health care app) ను రూపొందించాడు. అలా రూపొందించిన ఈ యాప్ డిసెంబర్ 2020లో MIT యాప్‌లో విజేతగా నిలిచింది.

Read more : 40 KM Speed Limit : స్పీడ్ 40 దాటొద్దు..బైక్‌పై చిన్నారులుంటే కంట్రోల్ కంపల్సరి

ఈ యాప్ ఉపయోగాలంటంటే..
ప్ర‌నేత్ త‌యారు చేసిన ఈ కొత్త యాప్ ప్రజలకు, ముఖ్యంగా చిన్నారులకు వ్యర్థ పదార్థాల నిర్వహణ..వాటిని ఏవిధంగా ఉపయోగించుకోవచ్చు? వంటి విషయాలపై అవగాహన కల్పించడంలో సహాయపడుతుంది. సరదాగా.. ఆకట్టుకునేవిధంగా ఉండేలా రూపొందించాడు. ప్రజలకు సమీపంలో ఉండే ప్రభుత్వేతర సంస్థలు అంటే NGOలను గుర్తిస్తుంది. వ్యర్థ పదార్థాలను పంపడానికి, గృహల వ్యర్థాల నుంచి కంపోస్ట్‌ను రూపొందించడం వంటి విషయాల్లో అవగాహన కల్పించేలా ఉంది.

ఏంటీ ఎంఐటీ యాప్‌..
MIT యాప్ ఇన్వెంటర్ అనేది ఆండ్రాయిడ్, iOS స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల కోసం పూర్తిగా ఫంక్షనల్ యాప్‌లను రూపొందించడానికి ప్రతి ఒక్కరినీ అనుమతించే విజువల్ ప్రోగ్రామింగ్ ఎన్విరాన్‌మెంట్. ఇది టెక్నాలజీ వినియోగం నుంచి సాంకేతిక సృష్టికి మారడానికి ప్రజలందరికీ..ముఖ్యంగా యువతకు సాధికారత కల్పించడం ద్వారా సాఫ్ట్‌వేర్ అభివృద్ధిని అంద‌రికీ చేరువ‌య్యేలా ప్ర‌య‌త్నిస్తుంది. కాగా..భారతదేశం ప్రతి సంవత్సరం 60 మిలియన్ టన్నుల చెత్తను ఉత్పత్తి చేస్తుందని పలు గణాకాలద్వారా వెల్లడైంది. ఇందులో 45 మిలియన్ టన్నుల చెత్త శుద్ధి చేయబడకుండా మిగిలిపోతోంది. దీని వల్ల పర్యావరణానికి హాని కలుగుతోంది.

Read more : Nicole Oliviera : నాసా కోసం 7 గ్రహశకలాలు కనిపెట్టిన 7 ఏళ్ల బాలిక

ట్రెండింగ్ వార్తలు