Delhi Police : హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన పెళ్లికూతురు.. స్పందించిన ఢిల్లీ పోలీసులు

చేసేది తప్పు పని అని తెలిసినా కొందరు కావాలని తప్పులు చేస్తున్నారు. రీల్ కోసం వీడియో చేస్తూ హెల్మెట్, లైసెన్స్ లేకుండా ఓ వధువు స్కూటీ నడపడంతో ఢిల్లీ పోలీసులు జరిమానా విధించారు. చలాన్లతో సరిపెట్టకుండా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

Viral Video

Viral Video : కొన్ని వీడియోలు చూస్తుంటే సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు తీస్తున్నారని తెలిసిపోతుంది. చేసేది తప్పని తెలిసి కొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఆ మధ్య కారుపైన కూర్చుని వివాహ వేదికకు వెళ్లిన పెళ్లికూతురు వీడియో వైరల్ అయ్యింది. తాజాగా హెల్మెట్, లైసెన్స్ లేకుండా ఓ పెళ్లికూతురు స్కూటీ నడిపింది.

Bicycle Stunt : రోడ్డుపై ఘోరంగా ఫెయిలైన సైకిల్ స్టంట్.. వీడియో షేర్ చేసిన ఢిల్లీ పోలీసులు

పెళ్లి దుస్తులు, ఆభరణాలు ధరించిన ఓ వధువు హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపింది. దీనికి సంబంధించిన వీడియో ఢిల్లీ పోలీసులకు చేరింది. దీనిపై వారు స్పందించారు. ‘ రీల్స్ కోసం మీ ప్రాణాలకు తెగించడం ఆందోళన కలిగిస్తోంది.. దయచేసి మూర్ఖత్వంతో కూడిన పనులు చేయకుండా జాగ్రత్తగా వాహనాలు నడపండి’ అనే శీర్షికతో వీడియోను తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో Delhi Police పోస్టు చేశారు. పోలీసులు హెల్మెట్ మరియు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు ఆ పెళ్లికూతురి పేరు మీద చలాన్ జారీ చేసినట్లు వీడియోలో చూపించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Delhi Police : వృత్తిని, అభిరుచుల్ని సమానంగా ప్రేమించాలంటున్న ఢిల్లీ పోలీసులు.. సమయం దొరికితే వాళ్లేం చేస్తున్నారంటే?

‘మంచి పని చేశారు. పదే పదే ఇలాంటి పనులు చేస్తే సంబంధిత ఐపీసీ క్రింద కేసులు నమోదు చేయండి’ అని ఒకరు.. ‘నేరం చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడానికి మంచి మార్గాన్ని ఎన్నుకున్నారు’ అని మరొకరు వరుసగా కామెంట్లు పెట్టారు. కేవలం చలాన్లతో సరిపెట్టకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని పలువురు ఈ సందర్భంగా పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

ట్రెండింగ్ వార్తలు