Bheemla Nayak : తెలుగు సినిమాని ఇక ఏ ఫోర్స్ ఆపలేదు.. ‘భీమ్లా నాయక్’పై దేవాకట్టా వ్యాఖ్యలు..

ఇటీవల 'రిపబ్లిక్' సినిమాతో హిట్ కొట్టిన ట్యాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్టా కూడా 'భీమ్లా నాయక్' సినిమా చూసి స్పెషల్ ట్వీట్ చేశారు. తమిళనాడులో కూడా పవన్ సినిమాకి అభిమానులు హంగామా.......

Bheemla Nayak :  పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా శుక్రవారం ఫిబ్రవరి 25 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. సినిమా కంటే ముందే పాటలు, ట్రైలర్స్ తో సినిమా మీద హైప్ పెరిగింది. భారీ అంచనాల మధ్య విడుదల అయిన భీమ్లా నాయక్ సినిమా భారీ విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో నిన్న పవన్ అభిమానులు హంగామా చేశారు. ఇక మొదటిరోజు కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయని సమాచారం. ‘భీమ్లా నాయక్’ సినిమా చూసి పలువురు స్టార్లు, సెలబ్రిటీలు పవన్, రానాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Pawan Kalyan : ఒక్కరోజులోనే 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్.. అమెరికాలో భీమ్లా నాయక్ కాసుల వర్షం..

ఇటీవల ‘రిపబ్లిక్’ సినిమాతో హిట్ కొట్టిన ట్యాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్టా కూడా ‘భీమ్లా నాయక్’ సినిమా చూసి స్పెషల్ ట్వీట్ చేశారు. తమిళనాడులో కూడా పవన్ సినిమాకి అభిమానులు హంగామా చేసిన ఓ వీడియోని షేర్ చేసి.. ”బాహుబలి తర్వాత ఇది మన తెలుగు సినిమా. భాష, సరిహద్దులు లేకుండా అందరిని కలుపుకుంటూ వెళుతుంది. ఇక ఏ ఫోర్స్ తెలుగు సినిమాని ఆపలేదు. ‘భీమ్లా నాయక్’తో సూపర్ సక్సెస్ అందుకున్న ఉస్తాద్ పవన్ కళ్యాణ్ మరియు రానాలకు, చిత్ర యూనిట్‌కి నా శుభాకాంక్షలు” అని పోస్ట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు