Google for India 2022 : మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లో డాక్టర్ల చేతిరాతను డీకోడ్ చేసే కొత్త AI ఫీచర్.. గూగుల్ లెన్స్ ద్వారా మందులను ఇలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు!

Google for India 2022 : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం (డిసెంబర్ 19, 2022) జరిగిన గూగుల్ ఇన్ ఇండియా ఈవెంట్‌ (#GoogleforIndia2022)లో టెక్ దిగ్గజం కొత్త AI టెక్నాలజీ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఏఐ ఫీచర్ ద్వారా డాక్టర్లు రాసిన మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లో వారి చేతిరాతను డీకోడ్ చేయవచ్చు.

Google for India 2022 : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం (డిసెంబర్ 19, 2022) జరిగిన గూగుల్ ఇన్ ఇండియా ఈవెంట్‌ (#GoogleforIndia2022)లో టెక్ దిగ్గజం కొత్త AI టెక్నాలజీ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఏఐ ఫీచర్ ద్వారా డాక్టర్లు రాసిన మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లో వారి చేతిరాతను డీకోడ్ చేయవచ్చు. అంటే.. వైద్యులు రాసిన మందులను ఎవరైనా సులభంగా అర్థం చేసుకోవచ్చు.

దీనికి సంబంధించి గూగుల్ (Google) అపోలో హాస్పిటల్స్‌ (apollo hospitals)తో కూడా భాగస్వామిగా ఉంది. Google ఇండియాలో రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ మనీష్ గుప్తా ఈ కొత్త AI ఫీచర్ ప్రకటించారు. పేషెంట్ల మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లో వైద్యులు రాసిన చేతిరాతను AI ఫీచర్ గూగుల్ లెన్స్ (Google Lens) ద్వారా సరిగ్గా అర్థంచేసుకోవచ్చు.

సాధారణంగా చాలామంది వైద్యులు మందుల ప్రిస్క్రిప్షన్‌లను అర్థంకానీ రీతిలో రాస్తుంటారు. పేషెంట్లు ఆయా ప్రిస్క్రిప్షన్‌లను అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యమే. ఈ సమస్య ఎన్నో దశాబ్దాలుగా ఉందనే చెప్పాలి. చాలా టెక్ సంస్థలు దీనిని పరిష్కరించేందుకు చాలా ప్రయత్నాలు చేశాయి. కానీ, ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

Read Also : Google For India : యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్ల కోసం కొత్త కోర్సులు.. మరెన్నో మానిటైజేషన్ అవకాశాలు.. ఎప్పటినుంచంటే?

ఇప్పుడు (Google) అసాధ్యం కానిది సుసాధ్యం చేస్తోంది. వైద్యుల ప్రిస్క్రిప్షన్‌లను సులభంగా ఎవరైనా అర్థం చేసుకునేలా కొత్త AI ఫీచర్ తీసుకొస్తోంది. పేషెంట్లు అర్థం చేసుకోలేని టెక్స్ట్‌లను సైతం సులభంగా ట్రాన్సులేట్ చేసేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. భారత్‌లో జరిగిన వార్షిక సమావేశంలో వైద్యుల చేతిరాతను డికోడ్ చేసేందుకు ఫార్మసిస్ట్‌లతో కలిసి పనిచేస్తున్నట్లు సెర్చ్ దిగ్గజం ప్రకటించింది.

Google can now decode doctors’ bad handwriting

Google లెన్స్‌లో రూపొందించిన ఈ కొత్త AI ఫీచర్, ప్రిస్క్రిప్షన్ ఫొటోను క్యాప్చర్ లేదా ఫొటో లైబ్రరీ నుంచి అప్‌లోడ్ చేసేందుకు వినియోగదారులకు అనుమతిస్తుంది. ఈ ఫొటోను ప్రాసెస్ చేసిన తర్వాత యాప్ నోట్‌లో పేర్కొన్న మందులను గుర్తిస్తుంది. ఈ ఫీచర్ ఏ విధంగా పనిచేస్తుందో Google ఎగ్జిక్యూటివ్ ఈవెంట్ ప్రదర్శనలో చూపించారు.

ప్రపంచంలోనే అత్యధికంగా గూగుల్ లెన్స్ (Google Lens) వినియోగదారులు భారత్‌లోనే ఉన్నారని గూగుల్ పేర్కొంది. మరోవైపు.. దక్షిణాసియా మార్కెట్‌లోని మిలియన్ల మంది యూజర్లు ఇంటర్నెట్‌లో స్పీచ్ టెక్స్ట్ (Speech – Text) రెండింటికీ కలిపి 100కి పైగా భారతీయ భాషలను కవర్ చేసేందుకు ఏకీకృత మోడల్‌పై పనిచేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

దేశంలో అర బిలియన్ వినియోగదారులను కలిగిన గూగుల్‌కు భారత్ కీలక మార్కెట్‌గా మారింది. అయితే, దక్షిణాసియా మార్కెట్‌లో గూగుల్‌కు అత్యంత కష్టతరమైన సంవత్సరాల్లో ఒకటిగా చెప్పవచ్చు. గూగుల్‌తో హాస్పిటల్ భాగస్వామ్యంపై డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ.. అపోలో హాస్పిటల్స్‌లో సర్వీసులను పొందేందుకు అపోలో 24X7 యాప్‌ను కూడా ప్రారంభించినట్లు ప్రకటించారు. క్షయవ్యాధి కోసం ఎక్స్-రేలను చెక్ చేసేందుకు AIని ఉపయోగించే గూగుల్‌తో అపోలో పని చేస్తోందని తెలిపారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Google For India 2022 : గూగుల్ ఆండ్రాయిడ్ యాప్‌కు ఇండియా డిజిలాకర్ ఇంటిగ్రేషన్.. మీ అధికారిక పత్రాలను ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు..!

ట్రెండింగ్ వార్తలు