Google For India 2022 : గూగుల్ ఆండ్రాయిడ్ యాప్‌కు ఇండియా డిజిలాకర్ ఇంటిగ్రేషన్.. మీ అధికారిక పత్రాలను ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు..!

Google For India 2022 : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) 8వ ఎడిషన్ గూగుల్ ఫర్ ఇండియా 2022 (#GoogleforIndia2022) ఈవెంట్‌‌‌ను సోమవారం, డిసెంబర్ 19, 2022న నిర్వహించింది. ఈ ఈవెంట్ యూట్యూబ్‌లో లైవ్ టెలిక్యాస్ట్ అయింది.

Google For India 2022 : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) 8వ ఎడిషన్ గూగుల్ ఫర్ ఇండియా 2022 (#GoogleforIndia2022) ఈవెంట్‌‌‌ను సోమవారం, డిసెంబర్ 19, 2022న నిర్వహించింది. ఈ ఈవెంట్ యూట్యూబ్‌లో లైవ్ టెలిక్యాస్ట్ అయింది. ఈ సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు భారతీయ మార్కెట్ కోసం గూగుల్ తదుపరి కార్యక్రమాలను ప్రకటించారు.

గూగుల్ 2022 ఈవెంట్‌ను ప్రారంభించడానికి ముందు గూగుల్ ఇండియా కంట్రీ హెడ్ & వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా వేదికపై అనేక అంశాలపై ప్రస్తావించారు. ఇందులో ప్రధానంగా గూగుల్ ఆండ్రాయిడ్ యాప్ (Google Android Files App) ద్వారా డిజిలాకర్ ఇంటిగ్రేషన్ అందించనున్నట్టు ప్రకటించింది. Files యాప్ నుంచి ప్రభుత్వం జారీ చేసిన అధికారిక పత్రాలను యాక్సెస్ చేసేందుకు వినియోగదారులను అనుమతించనుంది.

ఆండ్రాయిడ్‌లోని ఫైల్స్ యాప్‌ (Files App)కు భారత ఆన్‌లైన్ డాక్యుమెంట్ స్టోరేజ్ సర్వీస్ డిజిలాకర్‌ను తీసుకువస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. వార్షిక గూగుల్ ఫర్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ఫైల్స్ యాప్‌లో డిజిలాకర్ ఇంటిగ్రేషన్‌ను రూపొందించడానికి భారత ప్రభుత్వంతో గూగుల్ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. సెర్చ్ దిగ్గజం అధికారిక డాక్యుమెంట్లు, ప్రభుత్వ ID కార్డ్‌లతో సహా ముఖ్యమైన ఫైల్‌లను గుర్తించడానికి లేదా నిర్వహించడానికి సహాయపడే మెషీన్ లెర్నింగ్-ఆధారిత మోడల్‌ను కూడా ప్రకటించింది.

Google For India _ Google introduces India’s DigiLocker integration to Files Google Android app

Read Also : #GoogleForIndia2022: ఏఐ పరిశోధనల కోసం ఐఐటీ-మద్రాస్‌కు గూగుల్ రూ.8.26 కోట్లు

ఆండ్రాయిడ్‌లో డిజిలాకర్ ఇంటిగ్రేషన్ :

ఆండ్రాయిడ్‌లో డిజిలాకర్ ఇంటిగ్రేషన్ (DigiLocker Integration) భాగస్వామ్యంతో వినియోగదారులందరికీ సురక్షితమైన పద్ధతిలో డిజిటలైజ్డ్ డాక్యుమెంట్‌లకు యాక్సస్ చేసుకోవచ్చునని అభిషేక్ సింగ్ వెల్లడించారు. డిజిలాకర్‌కు 137 మిలియన్లకు పైగా రిజిస్టర్డ్ వినియోగదారులు ఉన్నారని సింగ్ చెప్పారు. ఈ సర్వీసులో ఇప్పటి వరకు 5.6 బిలియన్ల కన్నా ఎక్కువ అధికారిక డాక్యుమెంట్లను జారీ చేసిన 2,300 మందికి పైగా జారీదారులు ఉన్నారు.

డిజిలాకర్ మార్చిలో 100 మిలియన్ల వినియోగదారుల సంఖ్యను అధిగమించింది. ప్రభుత్వం జారీ చేసిన డాక్యుమెంట్లను తిరిగి పొందడానికి, డిజిటలైజ్ చేయడానికి లేదా స్టోర్ చేయడానికి APIలను ఉపయోగిస్తుంది. ఈ డిజిలాకర్ ఇంటిగ్రేషన్ విధానం వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందనే దానిపై Google ఖచ్చితమైన టైమ్‌లైన్‌లను వెల్లడించలేదు. భవిష్యత్తులో iOS వినియోగదారులకు కూడా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో కూడా వెల్లడించలేదు.

వార్షిక సమావేశం ఎనిమిదవ ఎడిషన్‌లో, Google సెర్చ్‌కు సంబంధించిన AI- ఆధారిత అప్‌డేట్స్ కూడా ప్రకటించింది.Google లెన్స్ కోసం AI టెక్ ఆఫర్‌ను కూడా ఆవిష్కరించింది. గూగుల్ వినియోగదారులకు డాక్టర్ల చేతివ్రాతను డీకోడ్ చేయడంలో సాయపడుతుంది. అంతేకాదు. యూట్యూబ్‌లో విద్యాపరమైన కంటెంట్‌ను డెవలప్ చేస్తున్న క్రియేటర్లకు మరిన్ని మానిటైజేషన్ బెనిఫిట్స్ అందించేందుకు Google YouTubeలో కోర్సులను ఒక ఫీచర్‌గా ప్రవేశపెట్టింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Google For India : యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్ల కోసం కొత్త కోర్సులు.. మరెన్నో మానిటైజేషన్ అవకాశాలు.. ఎప్పటినుంచంటే?

ట్రెండింగ్ వార్తలు