Jio Tariff Charges : కొడుకు పెళ్లి ఖర్చు మాపై వేస్తున్నావా అంబానీ మావా.. జియో రీఛార్జ్ ధరల పెంపుపై భారీగా ట్రోల్స్..!

Jio Tariff Charges : ఎన్నికలు కూడా అయిపోయాయి.. బాదుడే బాదుడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒకవైపు జియో సిగ్నల్ సరిగా రావడమే లేదు.. మళ్లీ దానికి తోడు జియో ఛార్జీల బాదుడు ఒకటి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Jio Tariff Charges : మొబైల్ యూజర్లకు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి టెలికం కంపెనీలు.. ఒకదాని తర్వాత మరొకటి మొబైల్ రీఛార్జ్ ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. టెలికం దిగ్గజాల్లో అగ్రగామి అయిన రిలయన్స్ జియో ముందుగా మొబైల్ టారిఫ్ ధరలను పెంచగా.. అదే బాటలో భారతీ ఎయిర్‌టెల్ కూడా మొబైల్ టారిఫ్ ధరలను పెంచేసింది.

కొత్తగా పెరిగిన మొబైల్ రీఛార్జ్ టారిఫ్ ధరలు వచ్చే జూలై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరల పెంపై జియో యూజర్లు మండిపడుతున్నారు. జియో ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ అనే తేడా లేకుండా అన్నింట్లో టారిఫ్ ధరలను పెంచేసింది అంబానీ కంపెనీ. కొత్త ధరలను పరిశీలిస్తే.. జియో కస్టమర్లపై నెలకు రూ. 600 పైనే భారం పడనుంది. దీనిపై జియో యూజర్లు సోషల్ మీడియా వేదికగా అంబానీపై భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. జియో రీఛార్జ్ ప్లాన్ల ధరలను ఒక్కసారిగా ఇంత పెంచుతారా? అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.

Read Also : Reliance Jio Tariff Hikes : జియో యూజర్లకు షాక్.. భారీగా పెరిగిన టారిఫ్ ధరలు.. కొత్త ప్లాన్ల వివరాలివే..!

జూలై 12న అనంత్ అంబానీ వివాహం :
వచ్చే జూలై 12న అంబానీ ఇంట పెళ్లి జరునున్న సంగతి తెలిసిందే. ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహానికి ముందుగానే ప్రీవెడ్డింగ్ పేరుతో లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఇటీవల అనంత్ వివాహానికి సంబంధించి ఇన్విటేషన్ కార్డు కూడా తెగ వైరల్ అయింది.

ప్రత్యేకించి ఈ కార్డు డిజైన్ కోసం ఏకంగా రూ. 6 లక్షలకు పైగా ఖర్చు చేశారట అంబానీ. దీనిపై నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. నీ కొడుకు పెళ్లి ఖర్చు మొత్తాన్ని దేశ ప్రజల నెత్తిన వేస్తున్నావా అంబానీ మావా అంటూ ఏకిపారేస్తున్నారు. ఎలాగో దేశంలో ఎన్నికలు కూడా అయిపోయాయి.. బాదుడే బాదుడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒకవైపు జియో సిగ్నల్ సరిగా రావడమే లేదు.. మళ్లీ దానికి తోడు జియో ఛార్జీల బాదుడు ఒకటి అంటూ మండిపడుతున్నారు.

భారీగా పెరిగిన జియో రీఛార్జ్ ధరలు :
జియో నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్‌ ధరలను రూ.155 నుంచి రూ.189కి పెంచేసింది. జియో ప్లాన్‌ను బట్టి పెంపు కనిష్ఠంగా రూ.34 నుంచి గరిష్ఠంగా రూ.600 వరకు పెరిగింది. 1 జీబీ డేటా యాడ్ ఆన్ ప్లాన్ ధరను రూ.15 నుంచి రూ.19కి పెంచేసింది. జియో సిగ్నల్ సరిగా ఉండటం లేదని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. జియో రీఛార్జ్ ధరల పెంపుతో మరో నెట్ వర్క్‌కు మారిపోతామని పోస్టులు పెడుతున్నారు.

ఇంతలో జియో మాదిరిగానే ఎయిర్‌టెల్ కూడా భారీగా మొబైల్ టారిఫ్ ధరలను పెంచడంతో మా పరిస్థితి ఏంటి అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇవన్నీ కాదు.. ప్రైవేట్ మొబైల్ నెట్‌వర్క్ కన్నా ప్రభుత్వం నెట్‌వర్క్ బీఎస్ఎన్ఎల్ బెటర్ అని నెటిజన్లు అంటున్నారు. వచ్చే ఆగస్టు 2024 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసులను ప్రారంభించనుంది. అప్పటిలోగా నెట్‌వర్క్ మారడమే మంచిదని, బీఎస్ఎన్ఎల్ 5జీ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటే బాగుండని కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Airtel Mobile Tariff Hike : జియో బాటలో ఎయిర్‌టెల్.. మొబైల్ టారిఫ్ ఛార్జీలు పెంపు.. కొత్త ప్లాన్ల ధరలివే..!

ట్రెండింగ్ వార్తలు