Tesla Car Share Directions : టెస్లా కారు యజమానులు ఫోన్ నుంచే నేరుగా డైరెక్షన్స్ షేర్ చేయొచ్చు.. ఇదేలా పని చేస్తుందో వీడియో షేర్ చేసిన ఎలన్ మస్క్..!

Tesla Car Share Directions : యజమానులు టెస్లా అప్లికేషన్‌కు ఎక్కడికి వెళ్లాలి అనేది నేరుగా తమ ఫోన్ నుంచి డైరెక్షన్స్ షేర్ చేయాలి. ఆ తర్వాత ఆటోపైలట్ మోడ్ ఫీచర్ సాయంతో టెస్లా కారు దానంతట అదే ఫాలో అవుతుంది.

Tesla Car Share Directions : ఆటోపైలట్ మోడ్ నుంచి అత్యాధునిక సాంకేతికత వరకు.. టెస్లా కార్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. టెస్లా కార్లలోని అడ్వాన్సడ్ టెక్నాలజీ ఫీచర్లే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఈ ఫీచర్లకు సంబంధించి ట్విట్టర్ (X)లో అధినేత ఎలన్ మస్క్ ఒక పోస్టు పెట్టారు. మస్క్ ప్రకారం.. టెస్లా యజమానులు కారుతో డైరెక్షన్లను ఎలా షేర్ చేయవచ్చు అనేది కంపెనీ ప్రదర్శించింది. కొన్ని డైరెక్షన్లను అనుసరించి యజమాని తమ గమ్యాన్ని కారుకు ఎలా తీసుకెళ్లవచ్చు అనేది వీడియోలో చూడవచ్చు.

Read Also : WhatsApp Users Alert : ఇది విన్నారా? ఈ 35 స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ ఇకపై పనిచేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

యజమానులు టెస్లా అప్లికేషన్‌కు ఎక్కడికి వెళ్లాలి అనేది నేరుగా తమ ఫోన్ నుంచి డైరెక్షన్స్ షేర్ చేయాలి. ఆ తర్వాత ఆటోపైలట్ మోడ్ ఫీచర్ సాయంతో టెస్లా కారు దానంతట అదే ఫాలో అవుతుంది. ప్రస్తుతం టెస్లా కార్లలో తలెత్తే సాంకేతిక సమస్యలు, కస్టమర్ల నుంచి నెగటివ్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత టెస్లా ఈ వీడియోను షేర్ చేసింది. టెస్లా అన్ని కొత్త ఈవీల నాణ్యతలో లెగసీ ఆటోమేకర్‌ల కన్నా ఆధిక్యాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది.

ఫోన్ ద్వారా టెస్లాకు డైరెక్షన్స్ ఎలా షేర్ చేయాలి?
టెస్లా స్మార్ట్‌ఫోన్ ద్వారా డైరెక్షన్స్ షేర్ చేసే సులభమైన విధానాన్ని తెలిపేలా ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో ఫోన్‌లలోని మ్యాప్‌లలో గమ్యస్థానాన్ని గుర్తించిన తర్వాత యూజర్లు షేర్‌పై ట్యాప్ చేసి టెస్లా యాప్‌పై క్లిక్ చేస్తారు. ఈ దశలో వెంటనే టెస్లా కారు డిస్‌ప్లేలో డైరెక్షన్స్ వెళ్లే మార్గాన్ని కలుపుతుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో టెస్లా అప్లికేషన్‌ ఉంటేనే ఈ కొత్త డైరెక్షన్ ఫీచర్ పనిచేస్తుంది.

ఈ ఆప్లికేషన్ ఆరంభం నుంచే టెస్లా ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ప్రమాణాలను చేర్చకుండా ప్రత్యేకమైన ఇన్-కార్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ను ఎంచుకుంది. ఈ విధానం కారు తయారీదారుల నుంచి భిన్నంగా ఉంటుంది. అందుకే, ఈ థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారమ్‌లను తమ వాహనాల్లోకి చేర్చుకుంటారు. ఈ క్రమంలోనే టెస్లా అంతర్గత వ్యవస్థ ఎక్స్‌ట్రనల్ ప్లాట్‌ఫారమ్‌లపై ఆధారపడకుండా తగిన యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఇది కారులో ఎంటర్‌టైన్మెంట్, నావిగేషన్, మొబైల్ ఫోన్ పెయిరింగ్ చేయొచ్చు. కొంతమంది వినియోగదారులు టెస్లా సిస్టమ్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కన్నా మెరుగైనదిగా భావిస్తున్నారు.

భారత్‌లోకి టెస్లా ఎంట్రీ?
భారత మార్కెట్లోకి టెస్లా రాక ఆసన్నమైంది. కానీ, మరింతగా ఆలస్యం అవుతుంది. టెస్లా సీఈఓ, ఎలన్ మస్క్ ఏప్రిల్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమై పెట్టుబడి ప్రకటన చేశారు. దాంతో దేశంలోకి టెస్లా బ్రాండ్ దాదాపు ఖాయమేనని ప్రకటించింది. అందులో భాగంగానే టెస్లా ఫ్యాక్టరీని కూడా దేశంలో ఏర్పాటు చేయాలని భావించారు. అయితే, మస్క్ భారీ బాధ్యతల కారణంగా పర్యటన ఆలస్యమైందని, ఈ ఏడాది చివరిలో భారత్ వస్తానని పేర్కొన్నాడు. జర్మనీలోని తన ప్లాంట్‌లో టెస్లా రైట్ హ్యాండ్ కార్లను ఉత్పత్తి చేసే ప్రక్రియలో ఉందని గతంలోనే నివేదించింది. టెస్లా బ్రాండ్ ఈ గిగా ఫ్యాక్టరీలో మోడల్ ’వై‘ని మాత్రమే తయారు చేస్తుంది. కానీ, భారత మార్కెట్లో మాత్రం మోడల్ 3ని తీసుకొచ్చే అవకాశం ఉంది.

ఇటీవల ఈవీలపై తన వారసత్వాన్ని టెస్లా కోల్పోయింది. ఈ నేపథ్యంలో అమెరికా ఇనిషియల్ క్వాలిటీ స్టడీ 2024లో టెస్లా బ్యాటరీ-ఎలక్ట్రిక్ వాహనాలు లేదా బీఈవీ, సాంప్రదాయ కార్ల తయారీదారుల నాణ్యత ఒకేలా ఉన్నాయని కనుగొన్నారు. కొత్తగా విక్రయించిన లేదా అద్దెకు తీసుకున్న 100 వాహనాలకు 266 సమస్యలు ఉన్నాయని నివేదించాయి. అన్ని రిపేరింగ్ కేటగిరీలలో గ్యాస్‌తో నడిచే వాహనాల కన్నా ప్లగ్-ఇన్ వాహనాలకు ఎక్కువ మరమ్మతులు అవసరమని అధ్యయనం కనుగొంది.

Read Also : ITR Filing Process : మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? పాత ఆదాయపు పన్ను విధానం ఎలా ఎంచుకోవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ట్రెండింగ్ వార్తలు