SIM Swap New Rules : మొబైల్ నంబర్ పోర్టబిలిటీపై కొత్త రూల్.. ఇకపై సిమ్ మార్చుకుంటే ఎన్ని రోజులు పడుతుందంటే?

SIM Swap New Rules : ఇలాంటి మోసాలకు అడ్డుకట్టవేసేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సిమ్ కార్డులపై పరిమితి కూడా ట్రాయ్ విధించింది. ఎవరైనా పరిమితికి మించి కొత్త సిమ్ కార్డు కొనేందుకు ప్రయత్నిస్తే వెంటనే రిజెక్ట్ అవుతుంది.

SIM Swap New Rules : మీరు మొబైల్ నెట్‌వర్క్ మారాలనుకుంటున్నారా? అయితే, ముందుగా మీ సిమ్ కార్డు స్వాపింగ్ లేదా పోర్టబులిటీ చేసుకోవాల్సిందే. మొబైల్ నెంబర్ పోర్టింగ్ చేసుకోవడంపై ట్రాయ్ (TRAI) కొత్త రూల్స్ తీసుకొచ్చింది. జులై 1 నుంచి సిమ్ పోర్టబిలిటీ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

అయితే, సిమ్ పోర్టింగ్ చేసుకునే వినియోగదారులు ముందుగా ఒక విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. సిమ్ కార్డు స్వాప్ అర్హత పొందాలంటే 7 రోజుల సమయం పడుతుంది. మొబైల్ ఫోన్ నంబర్లతో జరిగే నయా కొత్త మోసాలను అరికట్టేందుకు ట్రాయ్ ఈ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. గతంలో సిమ్ స్వాపింగ్ వెయిటింగ్ టైమ్ 10 రోజులు ఉండేది. తాజా సవరణతో ఇప్పుడు ఆ సమయాన్ని కాస్తా 7 రోజులకు తగ్గించింది.

Read Also : Airtel Mobile Tariff Hike : జియో బాటలో ఎయిర్‌టెల్.. మొబైల్ టారిఫ్ ఛార్జీలు పెంపు.. కొత్త ప్లాన్ల ధరలివే..!

మొబైల్ నెంబర్ ఒక నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌‌కు మారాలంటే 7 రోజులు సమయం మాత్రమే ఉంటుంది. సిమ్ స్వాప్ కోసం యూనిక్ పోర్టింగ్ కోడ్‌ (UPC) అందిస్తారు. గతంలో నిబంధన ప్రకారం.. సిమ్ స్వాపింగ్ అనంతరం 10 రోజుల వెయిటింగ్ టైమ్ చాలా ఎక్కువనే అభిప్రాయం వ్యక్తమైంది. దీని కారణంగా చాలామంది సబ్‌స్క్రైబర్లకు ఇబ్బందులకు మారిందని పలు సంస్థలు సైతం పేర్కొన్నాయి. వాస్తవానికి, మొబైల్ నెంబర్ పోర్టింగ్ కోసం 2 నుంచి 4 రోజుల వరకు సమయం చాలు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భారీగా పెరిగిన సైబర్ మోసాలు :
ప్రస్తుత రోజుల్లో చాలామంది అవసరానికి మించి సిమ్ కార్డులను కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా ప్రతిఒక్కరికి ఒకటి లేదా రెండు సిమ్ కార్డులు తప్పనిసరి. ఎందుకంటే.. ప్రతి స్మార్ట్ ఫోన్లలో డ్యూయల్ సిమ్ స్లాట్ కామన్‌గా ఉంటుంది. కానీ, చాలామంది సిమ్ కార్డులపై ఆఫర్లు చూసి టెంప్ట్ అయి కొత్తది తీసుకునే సంఖ్య భారీగా పెరిగింది.

పాత నెంబర్ పక్కన పడేసి కొత్త ఫోన్ నెంబర్ వాడుతున్నారు. ఆ తర్వాత అది కూడా పడేసి మరో కొత్త సిమ్ కోసం అప్లయ్ చేసుకుంటున్నారు. దీని కారణంగా సిమ్ కార్డుల మోసాల సంఖ్య కూడా భారీగానే పెరిగింది. సైబర్ నేరగాళ్లు సిమ్ కార్డు స్వాప్ ద్వారా వినియోగదారుల నుంచి విలువైన డేటాతో పాటు నగదును కాజేస్తున్నారు.

ఒక వ్యక్తికి 9 సిమ్ కార్డులు మాత్రమే :
ఇలాంటి మోసాలకు అడ్డుకట్టవేసేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సిమ్ కార్డులపై పరిమితి కూడా ట్రాయ్ విధించింది. ఇకపై ఎవరైనా పరిమితికి మించి కొత్త సిమ్ కార్డు కొనేందుకు ప్రయత్నిస్తే వెంటనే అది రిజెక్ట్ అవుతుంది. ఇందులో భాగంగానే ఆధార్ కార్డుతో గరిష్టంగా 9 సిమ్ కార్డులను మాత్రమే కొనుగోలు చేసేలా పరిమితి విధించింది. బల్క్‌లో సిమ్ కార్డులను కొనుగోలు చేయడం కుదరదు. అంతేకాదు.. ఇప్పటివరకూ మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులను కలిగి ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు.

Read Also : VI Plan Tariffs Hike : జియో, ఎయిర్‌టెల్ బాటలో వోడాఫోన్ ఐడియా.. బాదుడే బాదుడు.. రీఛార్జ్ ప్లాన్ల ధరల పెంపు..!

ట్రెండింగ్ వార్తలు