హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలంటూ రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

అందుకు కావాల్సిన నిధుల పూర్తి వివరాలు ఇవ్వాలని అన్నారు.

వరంగల్ అభివృద్ధిపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఫోకస్‌ పెట్టారు. వరంగల్ జిల్లా సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలన్నారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు గురించి ఆదేశాలు జారీ చేశారు. వాటికి సంబంధించిన భూసేకరణను పూర్తి చేయాలని చెప్పారు.

అందుకు సంబంధించిన నిధుల పూర్తి వివరాలు ఇవ్వాలని అన్నారు. జాతీయ రహదారి నుంచి నుంచి జాతీయ రహదారి అనుసంధానం అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని చెప్పారు. అలాగే, టెక్స్‌టైల్ పార్కుకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డుమార్గం ఉండేలా చూడాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.

తాగునీటి లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు వేయాలని అన్నారు. నగర అభివృద్ధిపై ఇకనుంచి 20 రోజులకోసారి ఇన్‌చార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించాలని చెప్పారు. తాము పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. డంపింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని చెప్పారు.

Also Read: అసెంబ్లీ సమావేశాలకు రావడానికి బీఆర్ఎస్‌లో కేటీఆర్, హరీశ్ రావు తప్ప ఎవరూ మిగలరు: ఎమ్మెల్యే యెన్నెం

ట్రెండింగ్ వార్తలు