Elon Musk Birthday : ఎలన్ మస్క్ 53వ పుట్టినరోజు.. 30 ఏళ్ల నాటి ఫొటోను షేర్ చేసిన టెక్ బిలియనీర్.. శుభాకాంక్షల వెల్లువ!

Elon Musk Birthday : జూన్ 28, 1971న దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో మే మస్క్, ఎర్రోల్ మస్క్‌లకు జన్మించాడు. తన పుట్టిన రోజు సందర్భంగా 1994 నాటి ఫొటోను మస్క్ షేర్ చేశాడు.

Elon Musk Birthday : ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్ ఈరోజు 53 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. తన పుట్టినరోజును పురస్కరించుకుని టెక్ బిలియనీర్ తన 30ఏళ్ల నాటి ఫొటోను ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ అయిన మస్క్.. జూన్ 28, 1971న దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో మే మస్క్, ఎర్రోల్ మస్క్‌లకు జన్మించాడు. తన పుట్టిన రోజు సందర్భంగా 1994 నాటి ఫొటోను మస్క్ షేర్ చేశాడు. దానికి “30 ఏళ్ల క్రితం నేను ఇలా ఉన్నాను చూడండి అంటూ మస్క్ పోస్ట్‌కు క్యాప్షన్‌గా పెట్టాడు.


Read Also : ITR Filing Process : మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? పాత ఆదాయపు పన్ను విధానం ఎలా ఎంచుకోవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

కొద్ది గంటల క్రితమే షేర్ చేసిన ఈ ఫొటోకు ఇప్పటివరకూ 6.1 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. టెస్లా చీఫ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు వందలకొద్ది వెల్లువెత్తుతున్నాయి. “హ్యాపీ బర్త్ డే బ్రదర్. మీరు మానవత్వం కోసం చేసే ప్రతిదానికీ ధన్యవాదాలు” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. “ఇప్పటి నుంచి 30 ఏళ్లలో ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు కావడానికి ఇది నాకు స్ఫూర్తినిచ్చింది” అని మరో యూజర్ వ్యాఖ్యానించారు.

ఎలన్ మస్క్ తల్లి కూడా అతడి 53వ పుట్టినరోజు సందర్భంగా చిన్ననాటి ఫొటోను షేర్ చేసింది. బిలియనీర్ పసిబిడ్డగా పుట్టినరోజు కేక్ ముందు నిలబడి ఉన్నట్లు ఆ ఫొటోలో చూడవచ్చు. “హ్యాపీ బర్త్‌డే @elonmusk 53 ఏళ్ల ఆనందం, ఉత్సాహానికి ధన్యవాదాలు. మీ అత్త లిన్ మీకోసం తయారు చేసిన కేక్‌ని చూసి మీ 4వ పుట్టినరోజున నవ్వినట్లుగా ఈరోజు కూడా నవ్వుతారని ఆశిస్తున్నాను. మీ గురించి గర్వపడుతున్నాను” అని రాశారు మాయె మస్క్.

1971లో జన్మించిన ఎలన్ మస్క్ :
తల్లి మాయే మస్క్ పోస్ట్‌కు 2లక్షల 30వేల కన్నా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. మస్క్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలతో వందల కొద్దీ కామెంట్లు వచ్చాయి. మీరు ఒక గొప్ప పిల్లవాడిని పెంచారు మాయే.. ఎలన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. ముఖ్యంగా, మస్క్ జూన్ 28, 1971న దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో ఎర్రోల్, మాయె మస్క్‌లకు జన్మించాడు. ఒంటారియోలోని కింగ్‌స్టన్‌లోని క్వీన్స్ యూనివర్శిటీలో పెన్సిల్వేనియా యూనివర్శిటీలో చదివాడు.

స్టాన్‌ఫోర్డ్ పీహెచ్ఎడీ ప్రోగ్రామ్‌కు మస్క్ ఎంపిక అయ్యాడు. కానీ, రెండు రోజుల తర్వాత తప్పుకున్నాడు. నెట్‌స్కేప్‌లో రోల్ కోసం ప్రయత్నించగా తిరస్కరించడంతో జిప్2 అనే వెబ్ సాఫ్ట్‌వేర్ కంపెనీని ప్రారంభించాడు. అప్పడే అతడ్ని ఈ కంపెనీ లక్షాధికారిని చేసింది. ప్రస్తుతం మస్క్ 210.7 బిలియన్ల డాలర్ల నికర విలువతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఆయన తన సంపదను ప్రధానంగా టెస్లాలో తన వాటాతో పాటు అలాగే స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో హోల్డింగ్స్ నుంచి పొందాడు.

Read Also : Tesla Car Share Directions : టెస్లా కారు యజమానులు ఫోన్ నుంచే నేరుగా డైరెక్షన్స్ షేర్ చేయొచ్చు.. ఇదేలా పని చేస్తుందో వీడియో షేర్ చేసిన ఎలన్ మస్క్..!

ట్రెండింగ్ వార్తలు