Ashwini Dutt : కల్కి నిర్మాతకు కంటి ఆపరేషన్.. కల్కి సినిమా ఇంకా చూడలేదట..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మూవీ కల్కి 2898 AD.
- Thota Vamshi Kumar
- Published On : June 29, 2024 / 07:02 PM IST
Producer Aswani Dutt not watched the Kalki 2898 AD movie
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మూవీ కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ దర్వకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రెండు రోజుల్లోనే 298.5 కోట్లను వసూలు చేసింది.
కలియుగాంతానికి, మహాభారతానికి లింక్ పెట్టి నాగ్ అశ్విన్ అదిరిపోయే చిత్రాన్ని తీశాడని సినిమా చూసిన వారు అంటున్నారు. సామాన్యులే కాదు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం సినిమాను అద్భుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు. అయితే.. ఈ చిత్రం కోసం దాదాపు రూ.600 కోట్లను ఖర్చు చేసి నిర్మించిన నిర్మాత అశ్వనీదత్ మాత్రం చూడలేదట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు.
Rao Ramesh : ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం నటుడు రావు రమేష్ విరాళం..
సినిమా సక్సెస్ సాధించిన క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఇంత వరకు సినిమా చూడలేదని చెప్పారు. తనకు పది రోజుల క్రితం కంటి ఆపరేషన్ జరిగిందని తెలిపారు. అందుకనే మూవీని చూడలేదన్నారు. మరో వారం రోజుల పాటు స్ర్కీన్‌ను చూడకూడదని, ఆ తరువాతనే కల్కి మూవీని చూస్తానని అన్నారు. ఈ విషయంలో మీడియా వాళ్లు, ప్రేక్షకులు అదృష్టవంతులని అని అశ్వీనీ దత్ అన్నారు.
కల్కి రెండో భాగం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తి అయిందని చెప్పారు. త్వరలోనే మిగిలిన షూటింగ్‌ను మొదలు పెట్టనున్నట్లు చెప్పారు. షూటింగ్ మొత్తం పూర్తి అయిన తరువాతే విడుదల తేదీ గురించి ఆలోచిస్తామన్నాడు. కాగా.. పార్ట్ 3 గురించి ఇంకా ఆలోచించలేదని ఈ సందర్భంగా అశ్వినీదత్ చెప్పారు.
