ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం న‌టుడు రావు ర‌మేష్ విరాళం..

గొప్ప ఆర్టిస్ట్ మాత్రమే కాదు తన తండ్రిలాగే గొప్ప మనసు ఉన్న వ్యక్తి అని రావు రమేష్‌ నిరూపించారు.

ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం న‌టుడు రావు ర‌మేష్ విరాళం..

Actor Rao Ramesh donates Rs.3 lakhs for the development of Undi Constituency

Updated On : June 29, 2024 / 7:00 PM IST

Rao Ramesh :తన విలక్షణమైన విలనిజంతో తెలుగునాట చెరగని ముద్ర వేసుకున్న లెజండరీ యాక్టర్ “రావు గోపాలరావు”. ఆయ‌న త‌న‌యుడిగా చిత్ర‌ పరిశ్రమలోకి అడుగుపెట్టారు రావు రమేష్‌. తనదైన నటనతో, విభిన్న పాత్రలతో అందర్నీ మెప్పించి స్టార్ ఆర్టిస్ట్ గా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. గొప్ప ఆర్టిస్ట్ మాత్రమే కాదు తన తండ్రిలాగే గొప్ప మనసు ఉన్న వ్యక్తి అని రావు రమేష్‌ నిరూపించారు.

ఉండి నియోజకవర్గంలో డ్రైనేజీ, నియోజకవర్గ అభివృద్ధి పనులకు త‌న వంతు సాయం అందించారు. రూ.3ల‌క్ష‌లను విరాళంగా అంద‌జేశారు. ఈ మేర‌కు చెక్కును ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుకి అందించారు. ఈ క్ర‌మంలో ఆయ‌నకి ఎమ్మెల్యే కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. కాగా..త‌న సంపాద‌న‌లో ఎంతో కొంత స‌మాజ సేవ కోసం ఉప‌యోగిస్తూ ఉంటారు రావు రమేష్‌.

Also Read : ‘హనుమాన్’ నుంచి ‘కల్కి’ వరకు.. 2024 టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ రిపోర్ట్.. ఏవి హిట్టు? ఏవి ఫట్టు?

‘ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన “Drainage Maintenance Infrastructure Fund, UNDI” నిధికి రూ. 3,00,000 లు విరాళం అందించిన ప్రముఖ సినీ నటుడు, నా మిత్రుడు రావు రమేష్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.’ అని ఎమ్మెల్యే ర‌ఘురామ కృష్ణం రాజుకి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రావు ర‌మేష్ చెక్ అందిస్తున్న ఫోటోల‌ను పంచుకున్నారు.