Realme C61 Launch : రూ.10వేల లోపు ధరలో రియల్‌మి C61 ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 28నే లాంచ్..!

Realme C61 Launch : రియల్‌మి సి61 ఈ నెల 28 నుంచి రియల్‌మి వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ మెయిన్‌లైన్ ఛానెల్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Realme C61 Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? రియల్‌‌మి లేటెస్ట్ బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి సి61 ఫోన్ వచ్చేస్తోంది. జూన్ 28న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. రియల్‌మి సి సిరీస్‌లో కొత్త పర్ఫార్మెన్స్, స్టైలిష్ డిజైన్, ఇమేజింగ్ ఫీచర్లతో వస్తుంది. రియల్‌మి సి61 (thUNISOC T612) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. మల్టీ టాస్కింగ్ పర్ఫార్మెన్స్ కూడా అందిస్తుంది.

Read Also : Realme V60 Series : కొత్త ఫోన్ కొంటున్నారా? భారీ బ్యాటరీతో రియల్‌మి V60 సిరీస్ ఇదిగో.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

భారీ 5000mAh బ్యాటరీతో లాంగ్ టైమ్ బ్యాటరీ లైఫ్ పొందవచ్చు. రోజువారీ వినియోగానికి సులభంగా ఉంటుంది. ఫోటోగ్రఫీ ఔత్సాహికుల కోసం 32ఎంపీ అల్ట్రా-క్లియర్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. పవర్‌ఫుల్ ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. పగలు లేదా రాత్రి అయినా సరే, అడ్వాన్స్‌డ్ అల్గారిథమ్‌లు, నైట్ మోడ్ ఫీచర్ హైక్వాలిటీ ఫొటోలను అందిస్తుంది.

రియల్‌మి C61 సిరీస్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
ఈ ఫోన్ సఫారి గ్రీన్, మార్బుల్ బ్లాక్ అనే 2 అద్భుతమైన కలర్ ఆప్షన్లలతో వస్తుంది. మొత్తం 3 స్టోరేజ్ ఆప్షన్‌లను అందిస్తుంది. 4జీబీ+64జీబీ ధర రూ.7,699, 4జీబీ+128జీబీ ధర రూ.7,999కి, 6జీబీ+128జీబీ ధర రూ.8,099కి పొందవచ్చు. రియల్‌మి సి61 ఆర్మర్‌సెల్ ప్రొటెక్షన్ అందిస్తుంది. దుమ్ము, నీటి నిరోధకతకు టీఓఇవీ రైన్‌ల్యాండ్ హైరిలయబిలిటీ సర్టిఫికేషన్, ఐపీ54 రేటింగ్‌ను కలిగి ఉంది.

రియల్‌మి సి61 సేల్ వివరాలు :
రియల్‌మి సి61 ఈ నెల 28 నుంచి రియల్‌మి వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ మెయిన్‌లైన్ ఛానెల్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి రియల్‌మి సి61 అదే ధరతో మెయిన్‌లైన్ రిటైల్ ఛానెల్‌లలో అందుబాటులో ఉండనుంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ నుంచి బ్యాంక్ ఆఫర్‌లతో ఈ డీల్ పొందవచ్చు. రియల్‌మి C61 ఫోన్ సరసమైన ధరతో అడ్వాన్స్‌డ్ ఫీచర్‌లను అందిస్తుంది.

Read Also : Realme GT 6 Sale : రియల్‌మి జీటీ 6 ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఈ 3 వేరియంట్ల ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు