Gyanvapi: జ్ఞానవాపి మసీదు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ

జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది.

Gyanvapi: జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. మసీదులో వీడియోగ్రఫీ సర్వేపై జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జోక్యం చేసుకుంటూ హిందూ సేన మరో పిటిషన్ దాఖలు చేసింది. మసీదులో హిందూ దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయని, కాశీ విశ్వనాథ్-జ్ఞానవాపి వివాదం చరిత్రను విస్మరించిందని హిందూసేన తన అఫిడవిట్‌లో పేర్కొంది.

Supreme Court Disha Case : ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ కేసు..విచారణ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం కోర్టు

దీనిపై స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి వివాదం కొనసాగుతున్నందున, 1991 పూజాస్థల చట్టం వర్తించదని హిందూసేన సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. కాగా కేసు విచారణను జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ, తాజాగా ఆదేశాలిచ్చింది.

ట్రెండింగ్ వార్తలు