దారుణం.. స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.. ఆ తర్వాత..

బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

Blackmail : మహిళలకు రక్షణ కరువైంది. నిత్యం ఏదో ఒక చోట వారిపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఎప్పుడు ఏ మృగాడు విరుచుకుపడతాడో తెలియని పరిస్థితి. భయంతో కొందరు, పరువు పోతుందని మరికొందరు.. అఘాయిత్యాలకు బలైపోతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ లోని పౌరీ జిల్లాలో దారుణం జరిగింది. సత్పులి ప్రాంతంలో ఓ మహిళ బాత్ రూమ్ లో స్నానం చేస్తుండగా ఓ వ్యక్తి సీక్రెట్ గా వీడియో తీశాడు. తర్వాత ఆ వీడియోను అడ్డం పెట్టుకుని అతడు రెచ్చిపోయాడు. తన కోరిక తీర్చాలని ఆమెను వేధించాడు.

తాను చెప్పినట్లు చేయకపోతే వీడియోను వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. వీడియోను అడ్డం పెట్టుకుని మహిళపై పలుమార్లు అత్యాచారం చేశాడు. రోజురోజుకి అతడి వేధింపులు ఎక్కువ కావడంతో మహిళ పోలీసులను ఆశ్రయించింది. జరిగిన దారుణాన్ని వారికి వివరించింది.

తాను స్నానం చేస్తుండగా వీడియో తీసి, దాన్ని వైరల్ చేస్తానని బెదిరించి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. బాత్ రూమ్ వీడియోను అడ్డం పెట్టుకుని మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Also Read : గుండెలు పిండే విషాదం.. కలిచివేస్తున్న సీరియల్ నటులు పవిత్ర, చందుల మరణం

ట్రెండింగ్ వార్తలు