Viral Video : కరెన్సీ నోట్లతో ముఖాన్ని తుడుచుకున్న పాక్ క్రికెటర్లు.. ఏకిపారేసిన నెటిజన్లు..!

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం, మరో క్రికెటర్ ఆజం ఖాన్ తన ముఖాన్ని కరెన్సీ నోట్లతో తుడుచుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాక్ నెటిజన్లు తీవ్రవిమర్శలు గుప్పించారు.

Viral Video : సరదా కోసం చేసిన పనికి పాక్ క్రికెటర్లు చిక్కుల్లో పడ్డారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం, మరో క్రికెటర్ ఆజం ఖాన్ తన ముఖాన్ని కరెన్సీ నోట్లతో తుడుచుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో కాస్తా ఈ వీడియో వైరల్ కావడంతో బాబర్ ఆజంతో పాటు ఆ దేశ క్రికెట్ జట్టులోని ఇతర క్రికెటర్లపై పాక్ నెటిజన్లు తీవ్రవిమర్శలు గుప్పించారు. ఈ వీడియో వాస్తవానికి బాబర్ అజామ్ స్నాప్‌చాట్ అకౌంట్లో షేర్ అయింది. అందులో ఆజం ఖాన్ బస్సు లోపల కూర్చుని కరెన్సీ నోట్లతో తన ముఖాన్ని తుడుచుకున్నట్లుగా వీడియోలో కనిపించింది.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఇద్దరూ ఈ అనుచిత చర్యకు పాల్పడ్డారు. బాబర్ వీడియోను రికార్డు చేస్తున్న సమయంలో ఆజం ఖాన్‌ను ఆటపట్టించాడు. అప్పుడే ఆజం విదేశీ కరెన్సీ నోట్లతో తన నుదురు తుడుచుకుంటున్నట్టుగా కనిపించాడు. అంతే.. సోషల్ మీడియాలో వేదికగా నెటిజన్లు వారిద్దరిని ఏకిపారేశారు. పాకిస్తానీ ప్రజలను ఎగతాళి చేస్తారా? అంటూ మండిపడ్డారు.

పాకి‌స్థా‌న్‌లో ఆహార కొరత కారణంగా అనేక మంది ప్రజలు చనిపోతున్నారు.. ఈ వ్యక్తి, వారికి డబ్బును విరాళంగా ఇవ్వడానికి బదులుగా హాయిగా ఇలా కూర్చొని పేద ప్రజలను వెక్కిరిస్తూ వీడియోలు చేస్తున్నాడు. ఇంటర్నెట్ వైఫై, ఖరీదైన మొబైల్ కోసం డబ్బును చెల్లిస్తున్నాడని విమర్శించారు.

మరోవైపు.. వేసవి వడగాలల కారణంగా అనేక మంది తట్టుకోలేక చనిపోతున్నారు.. కానీ, ఈ ఇద్దరు క్రికెటర్లు డబ్బుతో చిన్న పిల్లల మాదిరిగా ఇలా తమ చెమటను తుడుకుంటున్నారు అని ఒక యూజర్ విమర్శించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో పాకిస్థాన్ 2-1తో విజయం సాధించింది. బాబర్ నేతృత్వంలోని పాకిస్తాన్ తదుపరి 4- మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో తలపడుతుంది.

Read Also : SRH vs KKR IPL 2024 : క్వాలిఫయర్‌-1లో హైదరాబాద్‌ ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన కోల్‌కతా

ట్రెండింగ్ వార్తలు