Covid-19: విజృంభిస్తున్న కరోనా .. ఒక్క రోజే 20 వేల కేసులు నమోదు

కేంద్ర గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 1,36,076 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల శాతం 0.30. రికవరీ రేటు 98.50గా ఉంది. దేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,36,89,989. కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,25,557.

Covid-19: ఒక్క రోజులోనే కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,138 కరోనా కేసులు నమోదయ్యాయి. 38 మంది మరణించారు. ముందురోజుతో పోలిస్తే ఒక్క రోజులోనే అదనంగా 3,619 కేసులు నమోదవడం గమనార్హం. గత ఫిబ్రవరి తర్వాత కరోనా కేసులు 20 వేలు దాటడం ఇదే మొదటిసారి.

Sonia Gandhi: పార్టీ నేతలతో నేడు సోనియా భేటీ.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై చర్చ

ఈ పరిస్థితి పెరుగుతున్న కేసుల తీవ్రతకు అద్దం పడుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఉదయం ఈ వివరాలు వెల్లడించింది. కేంద్ర గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 1,36,076 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల శాతం 0.30. రికవరీ రేటు 98.50గా ఉంది. దేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,36,89,989. కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,25,557. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి తాజాగా కేంద్రం బూస్టర్ డోసుల్ని ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. 75 రోజులపాటు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. నిజానికి ప్రైవేటు కేంద్రాల్లో బూస్టర్ డోసు డబ్బులు చెల్లించి తీసుకునేందుకు కేంద్రం ఎప్పుడో అంగీకారం తెలిపింది. సెకండ్ డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకునేందుకు అనుమతించింది.

Nothing: ‘నథింగ్’ ఫోన్ దక్షిణాది కోసం కాదన్న సంస్థ.. మండిపడుతున్న నెటిజన్లు

అయితే, ఈ విషయంలో ప్రజల నుంచి స్పందన పెద్దగా లేదు. బూస్టర్ డోసు తీసుకునే గడువు సమీపించినా చాలా మంది ఆసక్తి చూపించడం లేదు. డబ్బులు చెల్లించాల్సి రావడంతోనే ప్రజలు బూస్టర్ డోసు తీసుకోవడం లేదని భావించిన ప్రభుత్వం ఉచితంగా బూస్టర్ డోసు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు