India vs England: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌.. ఓపెన‌ర్లుగా క్రీజులోకి శుభ్‌మ‌న్, పుజారా

కెప్టెన్ బాధ్య‌త‌లు ఫాస్ట్ బౌల‌ర్‌ జ‌స్ప్రిత్ బుమ్రాకు అప్ప‌గించారు. 35 ఏళ్ళ త‌ర్వాత ఓ ఫాస్ట్ బౌల‌ర్ కు టెస్టు జ‌ట్టు సార‌థ్య బాధ్య‌త‌లు ద‌క్క‌డం ఇదే మొద‌టిసారి. దాదాపు 35 ఏళ్ళ క్రితం ఫాస్ట్ బౌల‌ర్ క‌పిల్ దేవ్ టీమిండియా సార‌థి బాధ్య‌తల్లో కొన‌సాగారు.

India vs England: ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆతిథ్య జ‌ట్టుతో భార‌త్ ఐదో టెస్టు మ్యాచు ఆడుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా ఓపెన‌ర్లుగా క్రీజులోకి శుభ్‌మ‌న్ గిల్, ఛ‌టేశ్వ‌ర్ పుజారా వ‌చ్చారు. గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టునే నేడు నిర్వహిస్తున్నారు. ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉన్న విష‌యం తెలిసిందే. క‌రోనా సోకడంతో ఈ టెస్టు నుంచి కెప్టెన్ రోహిత్ శ‌ర్మ వైదొలిగాడు.

Maharashtra: మ‌హారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్ర‌మాణం.. డిప్యూటీ సీఎంగా ఫ‌డ్న‌వీస్

దీంతో కెప్టెన్ బాధ్య‌త‌లు ఫాస్ట్ బౌల‌ర్‌ జ‌స్ప్రిత్ బుమ్రాకు అప్ప‌గించారు. 35 ఏళ్ళ త‌ర్వాత ఓ ఫాస్ట్ బౌల‌ర్ కు టెస్టు జ‌ట్టు సార‌థ్య బాధ్య‌త‌లు ద‌క్క‌డం ఇదే మొద‌టిసారి. దాదాపు 35 ఏళ్ళ క్రితం ఫాస్ట్ బౌల‌ర్ క‌పిల్ దేవ్ టీమిండియా సార‌థి బాధ్య‌తల్లో కొన‌సాగారు. ఆయ‌న సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి 1987లో త‌ప్పుకున్నారు. అప్ప‌టి నుంచి నిన్న‌టి వర‌కు ఏ ఫాస్ట్ బౌల‌ర్ కూడా టీమిండియా టెస్టు జ‌ట్టుకు సార‌థ్యం వ‌హించ‌లేదు.

telangana: తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి: కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్

టీమిండియా: శుభ్‌మ‌న్ గిల్, ఛ‌టేశ్వ‌ర్ పుజారా, హ‌నుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిష‌బ్ పంత్, ర‌వీంద్ర జ‌డేజా, శార్దూల్ ఠాకూర్, మొహ‌మ్మ‌ద్ ష‌మీ, మొహ‌మ్మ‌ద్ సిరాజ్‌, జ‌స్ప్రిత్ బుమ్రా.

 

ట్రెండింగ్ వార్తలు