Indian Coast Guard: సముద్రంలో మునిగిపోయిన షిప్.. 22 మందిని రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్

గుజరాత్, పోరుబందర్ సముద్ర తీర ప్రాంతానికి 93 నాటికల్ మైళ్ల దూరంలో ఎమ్‌టీ గ్లోబల్ కింగ్ అనే వాణిజ్య నౌక సముద్రంలో మునిగిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న ‘ద ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐజీసీ)’ నౌకలో చిక్కుకున్న వారిని రక్షించే చర్యలు చేపట్టింది.

Indian Coast Guard: గుజరాత్ తీర ప్రాంతంలో ఒక నౌక సముద్రంలో మునిగిపోయిన ఘటనలో, 22 మంది సిబ్బందిని భారత తీర ప్రాంత భద్రతా దళం రక్షించింది. గుజరాత్, పోరుబందర్ సముద్ర తీర ప్రాంతానికి 93 నాటికల్ మైళ్ల దూరంలో ఎమ్‌టీ గ్లోబల్ కింగ్ అనే వాణిజ్య నౌక సముద్రంలో మునిగిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న ‘ద ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐజీసీ)’ నౌకలో చిక్కుకున్న వారిని రక్షించే చర్యలు చేపట్టింది. ఐజీసీకి చెందిన పడవలతోపాటు, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు చెందిన ధృవ్ అనే హెలికాప్టర్ ఈ రక్షణ చర్యల్లో పాల్గొన్నాయి. పడవలు, హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి చేరుకున్న ఐజీసీ దళం.. నౌకలో చిక్కుకున్న మొత్తం 22 మంది సిబ్బందిని రక్షించారు.

Hyderabad: మహిళలకు పోర్న్ వీడియోలు పంపుతున్న వ్యక్తి అరెస్టు

వీరిలో 20 మంది భారతీయులుకాగా, ఒకరు శ్రీలంక పౌరుడు. మరొకరు పాకిస్తానీ. రక్షించిన సిబ్బందిని పోరు బందరు పోర్టుకు తరలించారు. నౌకలోకి భారీ ఎత్తున నీళ్లు రావడంతో కంట్రోల్ తప్పి మునిగిపోయింది. ఆరు వేల టన్నుల తారును తీసుకెళ్తున్న ఈ నౌక యూఏఈ నుంచి ఇండియాలోని కర్వార్ తీరానికి వెళ్తోంది. ఇక ధృవ్ హెలికాప్టర్‌ను ఈమధ్య కాలం నుంచే రక్షణ కోసం వినియోగిస్తున్నారు. అరేబియా సముద్ర తీరంలో ఐజీసీ గస్తీ కాస్తుంది.

ట్రెండింగ్ వార్తలు