ఐపీఎల్(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఘన విజయం సాధించింది
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఘన విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులకే పరిమితమైంది. దీంతో చెన్నై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది.
19 ఓవర్‌ను తుషార్ దేశ్‌పాండే 4 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి రిపాల్ పటేల్(9) రనౌట్ అయ్యాడు. దీంతో 124 పరుగుల వద్ద ఢిల్లీ ఏడో వికెట్ కోల్పోయింది. 19 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 124/7. లలిత్ యాదవ్(0), అమన్ హకీమ్ ఖాన్(1) లు క్రీజులో ఉన్నారు.
18 ఓవర్‌ను మతీషా పతిరణ వేయగా 12 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి అక్షర్(21) పటేల్ భారీ షాట్ కొట్టగా రహానే క్యాచ్ పట్టాడు. దీంతో 116 పరుగుల వద్ద ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. 18 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 120/6. రిపాల్ పటేల్(6), అమన్ హకీమ్ ఖాన్(0) లు క్రీజులో ఉన్నారు.
17 ఓవర్‌ను మహేశ్ తీక్షణ వేయగా 11 పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి అక్షర్ పటేల్ సిక్స్ కొట్టాడు. 17 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 108/5. రిపాల్ పటేల్(5), అక్షర్‌పటేల్(16) లు క్రీజులో ఉన్నారు.
16 ఓవర్‌ను మతీషా పతిరణ వేయగా 6 పరుగులు వచ్చాయి. మూడో బంతికి అక్షర్ పటేల్ ఫోర్ కొట్టాడు. 16 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 97/5. రిపాల్ పటేల్(4), అక్షర్‌పటేల్(6) లు క్రీజులో ఉన్నారు.
ఢిల్లీ మరో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రిలీ రోసో(35) మతీషా పతిరణ చేతికి చిక్కాడు. దీంతో 89 పరుగుల(14.3వ ఓవర్) వద్ద ఢిల్లీ ఐదో వికెట్‌ను కోల్పోయింది. 15 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 91/5. రిపాల్ పటేల్(3), అక్షర్‌పటేల్(1) లు క్రీజులో ఉన్నారు.
14వ ఓవర్‌ను మొయిన్ అలీ కట్టుదిట్టంగా వేయగా 4 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 88/4. రిపాల్ పటేల్(1), రిలీ రోసో(35) లు క్రీజులో ఉన్నారు.
13వ ఓవర్‌ను మతీషా పతిరణ వేయగా 8 పరుగులు వచ్చాయి. తొలి బంతికి సిక్స్ కొట్టిన మనీష్ పాండే(27) ఆఖరి బంతికి ఎల్భీగా ఔట్ అయ్యాడు. 14 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 84/4. రిలీ రోసో(33) క్రీజులో ఉన్నాడు.
12వ ఓవర్‌ను మొయిన్ అలీ వేయగా 4 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 76/3. మనీష్ పాండే(20), రిలీ రోసో(32) లు క్రీజులో ఉన్నారు.
11వ ఓవర్‌ను రవీంద్ర జడేజా వేయగా 7 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 72/3. మనీష్ పాండే(18), రిలీ రోసో(30) లు క్రీజులో ఉన్నారు.
పదో ఓవర్‌ను మొయిన్ అలీ కట్టుదిట్టంగా వేయడంతో రెండు పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 65/3. మనీష్ పాండే(16), రిలీ రోసో(25) లు క్రీజులో ఉన్నారు.
తొమ్మిదో ఓవర్‌ను జడేజా వేయగా ఎనిమిది పరుగులు వచ్చాయి. 9 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 63/3. మనీష్ పాండే(15), రిలీ రోసో(24) లు క్రీజులో ఉన్నారు.
ఎనిమిదో ఓవర్‌ను మొయిన్ అలీ వేయగా 7 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి పాండే సిక్స్ కొట్టాడు. 8 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 55/3. మనీష్ పాండే(14), రిలీ రోసో(17) లు క్రీజులో ఉన్నారు.
ఏడో ఓవర్‌ను రవీంద్ర జడేజా కట్టుదిట్టంగా వేయడంతో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. 7 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 48/3. మనీష్ పాండే(8), రిలీ రోసో(16) లు క్రీజులో ఉన్నారు.
చెన్నై ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ముగిసింది. ఆరో ఓవర్‌ను మహేశ్ తీక్షణ వేయగా 5 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 47/3. మనీష్ పాండే(8), రిలీ రోసో(15) లు క్రీజులో ఉన్నారు.
5వ ఓవర్‌ను దీపక్ చాహర్ వేయగా 15 పరుగులు వచ్చాయి. రెండో బంతికి సిక్స్ కొట్టిన రూసో నాలుగో బంతికి ఫోర్ బాదాడు. ఆఖరి బంతికి పాండే ఫోర్ కొట్టాడు. 5 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 42/3. మనీష్ పాండే(6), రిలీ రోసో(12) లు క్రీజులో ఉన్నారు.
ఢిల్లీ వరుసగా వికెట్లు కోల్పోతుంది. మిచెల్ మార్ష్(5) రనౌట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ 25 పరుగుల(3.1వ ఓవర్) వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 4 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 27/3. మనీష్ పాండే(2), రిలీ రోసో(1) లు క్రీజులో ఉన్నారు.
మూడో ఓవర్‌ను దీపక్ చాహర్ వేయగా రెండో బంతికి సిక్స్ కొట్టిన సాల్ట్(17) ఆ మరుసటి బంతికే మరో షాట్‌కు యత్నించి రాయుడు చేతికి చిక్కాడు. ఢిల్లీ 20 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 3 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 25/2. మనీష్ పాండే(1), మిచెల్ మార్ష్(5) లు క్రీజులో ఉన్నారు.
రెండో ఓవర్‌ను తుషార్ దేశ్‌పాండే వేయగా 12 పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి ఫోర్ కొట్టిన సాల్ట్ ఐదో బంతికి సిక్స్ బాదాడు. 2 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 13/1. ఫిలిప్ సాల్ట్(11), మిచెల్ మార్ష్(1) లు క్రీజులో ఉన్నారు.
లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఢిల్లీకి రెండో బంతికే భారీ షాక్ తగిలింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ (0) రహానే చేతికి చిక్కాడు. దీంతో ఢిల్లీ మొదటి వికెట్ కోల్పోయింది. 1 ఓవర్‌కు ఢిల్లీ స్కోరు 1/1. ఫిలిప్ సాల్ట్(0), మిచెల్ మార్ష్(1) లు క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో రుతురాత్(24), రహానే(21), దూబే (25), రాయుడు(23), జడేజా(21)లకు మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఆఖర్లో ధోని(20; 9 బంతుల్లో 1ఫోర్, 2 సిక్స్‌లు) తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దీంతో ఢిల్లీ ముందు 168 పరుగుల లక్ష్యం నిలిచింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ మూడు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ రెండు, ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
19వ ఓవర్‌ను ఖలీల్ అహ్మద్ వేయగా 21 పరుగులు వచ్చాయి. ధోని రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ కొట్టాడు. 19 ఓవర్లకు చెన్నై స్కోరు 160/6. రవీంద్ర జడేజా(17), ధోని(20) లు క్రీజులో ఉన్నారు.
18వ ఓవర్‌ను కల్దీప్ యాదవ్ వేయగా 11 పరుగులు వచ్చాయి. రెండో బంతికి జడేజా సిక్స్ కొట్టాడు. 18 ఓవర్లకు చెన్నై స్కోరు 139/6. రవీంద్ర జడేజా(17), ధోని(1) లు క్రీజులో ఉన్నారు.
చెన్నై మరో వికెట్ కోల్పోయింది. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అంబటి రాయుడు(23) రిపాల్ పటేల్ చేతికి చిక్కాడు. దీంతో 126 పరుగుల(16.2వ ఓవర్) వద్ద చెన్నై ఆరో వికెట్ కోల్పోయింది. 17 ఓవర్లకు చెన్నై స్కోరు 128/6. రవీంద్ర జడేజా(7), ధోని(1) లు క్రీజులో ఉన్నారు.
16వ ఓవర్‌ను కుల్దీప్ యాదవ్ వేయగా 8 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లకు చెన్నై స్కోరు 125/5. రవీంద్ర జడేజా(5), అంబటి రాయుడు(23) లు క్రీజులో ఉన్నారు.
దూకుడుగా ఆడుతున్న దూబే(25) ఔట్ అయ్యాడు. మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టగా బౌండరీ లైన్ వద్ద డేవిడ్ వార్నర్ చేతికి చిక్కాడు. దీంతో 113 పరుగుల(14.2వ ఓవర్) వద్ద చెన్నై ఐదో వికెట్‌ను కోల్పోయింది. 15 ఓవర్లకు చెన్నై స్కోరు 117/5. రవీంద్ర జడేజా(2), అంబటి రాయుడు(20) లు క్రీజులో ఉన్నారు.
శివమ్ దూబే, రాయుడులు దూకుడు పెంచాడు. లలిత్ యాదవ్ వేసిన 14వ ఓవర్లో 23 పరుగులు రాబట్టారు. తొలి రెండు బంతులను దూబే సిక్స్‌లుగా మలచగా రాయుడు నాలుగో బంతికి ఫోర్, ఆఖరి బంతికి సిక్స్ కొట్టాడు. 14 ఓవర్లకు చెన్నై స్కోరు 111/4. శివమ్ దూబే(25), అంబటి రాయుడు(18) లు క్రీజులో ఉన్నారు.
13వ ఓవర్‌ను మిచెల్ మార్ష్ కట్టుదిట్టంగా వేయడంతో 6 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లకు చెన్నై స్కోరు 88/4. శివమ్ దూబే(12), అంబటి రాయుడు(8) లు క్రీజులో ఉన్నారు.
ఢిల్లీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నారు. అజింక్యా రహానే(21) ఔట్ అయ్యాడు. లలిత్ యాదవ్ బౌలింగ్‌లో అతడే క్యాచ్ పట్టుకోవడంతో రహానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 77 పరుగుల(11.1వ ఓవర్) వద్ద చెన్నై నాలుగో వికెట్ కోల్పోయింది. 12 ఓవర్లకు చెన్నై స్కోరు 82/4. శివమ్ దూబే(10), అంబటి రాయుడు(4) లు క్రీజులో ఉన్నారు.
11వ ఓవర్‌ను అక్షర్ పటేల్ వేయగా 11 పరుగులు వచ్చాయి. రెండో బంతికి శివమ్ దూబే సిక్స్ కొట్టాడు. 11 ఓవర్లకు చెన్నై స్కోరు 77/3. శివమ్ దూబే(9), అజింక్యా రహానే(21) లు క్రీజులో ఉన్నారు.
చెన్నై మరో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ క్యాచ్ అందుకోవడంతో మొయిన్ అలీ(7) పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో చెన్నై 64 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 10 ఓవర్లకు చెన్నై స్కోరు 66/3. శివమ్ దూబే(1), అజింక్యా రహానే(18) లు క్రీజులో ఉన్నారు.
తొమ్మిదో ఓవర్‌ను అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా వేయడంతో నాలుగు పరుగులు వచ్చాయి. 9 ఓవర్లకు చెన్నై స్కోరు 61/2. మొయిన్ అలీ(6), అజింక్యా రహానే(15) లు క్రీజులో ఉన్నారు.
ఎనిమిదో ఓవర్‌ను కుల్దీప్ యాదవ్ వేయగా 5 పరుగులు వచ్చాయి. 8 ఓవర్లకు చెన్నై స్కోరు 57/2. మొయిన్ అలీ(5), అజింక్యా రహానే(13) లు క్రీజులో ఉన్నారు.
చెన్నై మరో వికెట్‌ను కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన 6.1 ఓవర్లో అమన్ హకీమ్ ఖాన్ క్యాచ్ అందుకోవడంతో రుతురాజ్ గైక్వాడ్(24) ఔట్ అయ్యాడు. దీంతో 49 పరుగుల వద్ద చెన్నై రెండో వికెట్ కోల్పోయింది. 7 ఓవర్లకు చెన్నై స్కోరు 52/2. మొయిన్ అలీ(2), అజింక్యా రహానే(11) లు క్రీజులో ఉన్నారు.
చెన్నై ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ముగిసింది. ఆరో ఓవర్‌ను ఇషాంత్ శర్మ వేయగా 8 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు చెన్నై స్కోరు 49/1. రుతురాజ్ గైక్వాడ్(24), అజింక్యా రహానే(10) లు క్రీజులో ఉన్నారు.
డెవాన్ కాన్వే(10) ఔట్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఎల్భీగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో ఢిల్లీ 32 పరుగుల(4.1వ ఓవర్) వద్ద తొలి వికెట్ కోల్పోయింది. వచ్చి రావడంతో రహానే రెండు ఫోర్లు కొట్టాడు. 5 ఓవర్లకు చెన్నై స్కోరు 41/1. రుతురాజ్ గైక్వాడ్(17), అజింక్యా రహానే (9) లు క్రీజులో ఉన్నారు.
నాలుగో ఓవర్‌ను లలిత్ యాదవ్ వేయగా 7 పరుగులు వచ్చాయి.నాలుగో బంతికి కాన్వే ఫోర్ కొట్టాడు. 4 ఓవర్లకు చెన్నై స్కోరు 32/0. రుతురాజ్ గైక్వాడ్(17), డెవాన్ కాన్వే(11) లు క్రీజులో ఉన్నారు.
మూడో ఓవర్‌ను ఖలీల్ అహ్మద్ వేయగా 5 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లకు చెన్నై స్కోరు 25/0. రుతురాజ్ గైక్వాడ్(16), డెవాన్ కాన్వే(5) లు క్రీజులో ఉన్నారు.
రెండో ఓవర్‌ను ఇషాంత్ శర్మ వేయగా 16 పరుగులు వచ్చాయి. రుతురాజ్ గైక్వాడ్ మూడు ఫోర్లు కొట్టాడు. 2 ఓవర్లకు చెన్నై స్కోరు 20/0. రుతురాజ్ గైక్వాడ్(15), డెవాన్ కాన్వే(1) లు క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వేలు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. మొదటి ఓవర్‌ను ఖలీల్ అహ్మద్ వేశాడు. 1 ఓవర్‌కు చెన్నై స్కోరు 4/0. రుతురాజ్ గైక్వాడ్(2), డెవాన్ కాన్వే(1) లు క్రీజులో ఉన్నారు.
డేవిడ్ వార్నర్(కెప్టెన్), ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రోసోవ్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కెప్టెన్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు.