New York : బుల్డోజ‌ర్లు వ‌చ్చేశాయి.. నేలమట్టం కానున్న న్యూయార్క్‌ క్రికెట్ స్టేడియం.. భారత్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ జ‌రిగింది ఇక్క‌డే..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌తో స‌హా 8 లీగ్ మ్యాచ్‌ల‌కు న్యూయార్క్‌లోని నాసౌ కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది.

Bulldozers Arrive To Demolish India vs Pakistan T20 World Cup Venue

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌తో స‌హా 8 లీగ్ మ్యాచ్‌ల‌కు న్యూయార్క్‌లోని నాసౌ కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. కాగా.. ఈ స్టేడియాన్ని శుక్ర‌వారం నుంచి కూల్చి వేయ‌నున్నారు. కొద్ది రోజుల్లో ఈ స్టేడియం క‌నుమ‌రుగు కానుంది.

అమెరికాలో క్రికెట్‌కు ఆద‌ర‌ణ పెంచాల‌నే ల‌క్ష్యంతో ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లోని లీగ్ మ్యాచ్‌ల‌ను ప్లోరిడా, డ‌ల్లాస్‌, న్యూయార్క్‌లో నిర్వ‌హించింది. న్యూయార్క్‌లో మ్యాచ్‌ల కోసం లాంగ్ ఐలాండ్‌లోని ఐసెన్‌హోవర్ పార్క్‌లో తాత్కాలిక స్టేడియాన్ని నిర్మించింది. 106 రోజుల్లో 34వేల సీటింగ్ కెపాసిటీతో దాన్ని నిర్మించారు. ఇందుకోసం రూ.240 కోట్లు ఖ‌ర్చైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Pakistan : పాకిస్తాన్ అదృష్టం మామూలుగా లేదుగా.. త‌ట్టాబుట్టా స‌ర్దుకోవాల్సిందే..!

ఈ మైదానంలో ఏర్పాటు చేసిన డ్రాప్ ఇన్ పిచ్‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అనూహ్య బౌన్స్‌, ట‌ర్న్‌, పేస్‌తో బ్యాట‌ర్లు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. 8 మ్యాచుల‌కు ఆతిథ్యం ఇచ్చిన ఈ స్టేడియాన్ని ఆరు వారాల్లోనే కూల‌గొట్ట‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు.

బుధవారం అమెరికా, భార‌త్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచే ఈ స్టేడియంలో చివ‌రి మ్యాచ్‌. ప్ర‌స్తుతం ప‌దుల సంఖ్య‌లో బుల్డోజ‌ర్లు స్టేడియానికి చేరుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి. కాగా.. ఈ స్టేడియంలో జ‌రిగిన భార‌త్‌, పాక్ మ్యాచ్ అభిమానుల‌కు కావాల్సిన వినోదాన్ని అందించింది.

Rohit Sharma : కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌.. గంగూలీ రికార్డు బ్రేక్‌.. ధోనిని అందుకునేనా..?