Pakistan : పాకిస్తాన్ అదృష్టం మామూలుగా లేదుగా.. త‌ట్టాబుట్టా స‌ర్దుకోవాల్సిందే..!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో పాకిస్తాన్ గ్రూపు ద‌శ నుంచే ఇంటి ముఖం ప‌ట్టే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

Pakistan : పాకిస్తాన్ అదృష్టం మామూలుగా లేదుగా.. త‌ట్టాబుట్టా స‌ర్దుకోవాల్సిందే..!

Pakistan May Face T20 World Cup Elimination Due To State Of Emergency

Updated On : June 13, 2024 / 4:00 PM IST

Pakistan : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో పాకిస్తాన్ గ్రూపు ద‌శ నుంచే ఇంటి ముఖం ప‌ట్టే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇప్ప‌టికే రెండు మ్యాచుల్లో ఓడిన పాకిస్తాన్ సూప‌ర్-8 అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది. కెన‌డా పై విజ‌యం సాధించినా ఐర్లాండ్‌తో జ‌రిగే ఆఖ‌రి మ్యాచ్‌లో భారీ తేడాతో గెల‌వాల్సిన అవ‌స‌రం ఉంది. అలా గెలిచినా కూడా ఇత‌ర జ‌ట్ల స‌మీక‌ర‌ణాల ఆధారంగానే టోర్నీలో ముందు అడుగు వేసే అవ‌కాశం ఉంది.

అయితే.. జూన్ 16న ఫ్లోరిడా వేదిక‌గా ఐర్లాండ్‌తో పాకిస్తాన్ గ్రూపు ద‌శ‌లో ఆఖ‌రి మ్యాచ్ ఆడ‌నుంది. అస‌లు ఈ మ్యాచ్ జ‌రిగే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లోరిడాలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలో ప‌లు చోట్ల వ‌ర‌ద‌లు వ‌చ్చి ఇళ్ల‌లోకి నీరు చేరుతోంది. ఈ నేప‌థ్యంలో ఆ ప్రాంతంలో ఎమ‌ర్జెన్సీని విధించారు.

Virat Kohli : మూడు మ్యాచుల్లో 5 ప‌రుగులు.. కోహ్లి ఫామ్ పై గ‌వాస్క‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇది ఆరంభ‌మే..

వాన‌, వ‌ర‌ద ఉధృతి ఎక్కువ అయ్యే సూచ‌న‌లు ఉండ‌డంతో అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప ప్ర‌జ‌ల‌ను బ‌య‌ట‌కు రావొద్ద‌ని అక్క‌డి ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. మ‌రో నాలుగైదు రోజులు ఇదే ప‌రిస్థితి కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఈ క్ర‌మంలో ఐర్లాండ్‌తో మ్యాచ్ గ‌నుక ర‌ద్దు అయితే పాకిస్తాన్ ఇంటి ముఖం ప‌ట్టాల్సి ఉంటుంది.

ఇలా జ‌రిగినా పాక్ ఇంటికే..

ఫ్లోరిడా వేదిక‌గా జూన్ 14న యూఎస్ఏ-ఐర్లాండ్‌, జూన్ 15న భార‌త్‌-కెన‌డా, జూన్ 16న ఐర్లాండ్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచులు జ‌ర‌గాల్సి ఉంది. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయే లేదో చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. సూప‌ర్‌-8కు చేరే క్ర‌మంలో అమెరికా, పాకిస్తాన్‌ల‌కు ఈ మ్యాచులు చాలా కీల‌కంగా మారింది.

జూన్ 14న జ‌ర‌గాల్సిన అమెరికా, ఐర్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయినా స‌రే పాక్ ఇంటి ముఖం ప‌ట్టాల్సిందే. ఎందుకంటే గ్రూపు ఏ నుంచి భార‌త్ సూప‌ర్ 8కి చేరుకుంది. మిగిలిన ఒక్క స్థానం కోసం పాక్‌, అమెరికా మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉంది. అయితే.. అమెరికా రెండు మ్యాచులు గెల‌వ‌డంతో ఆ జ‌ట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి.

Cheating : ఖ‌తార్ తొండాట‌.. రిఫ‌రీ స‌హ‌కారం.. భార‌త్‌కు తీవ్ర అన్యాయం.. వీడియో

వ‌ర్షం కార‌ణంగా ఐర్లాండ్ మ్యాచ్ ర‌ద్దు అయితే అప్పుడు అమెరికా జ‌ట్టు పాయింట్ల సంఖ్య ఐదుకు చేరుకుంటుంది. అదే జ‌రిగితే పాకిస్తాన్ త‌మ ఆఖ‌రి మ్యాచ్‌లో గెలిచినా ఆ జ‌ట్టు ఖాతాలో నాలుగు పాయింట్లే ఉంటాయి. అప్పుడు అమెరికా త‌దుప‌రి ద‌శ‌కు చేరుకుంటుంది.

కాగా.. సౌత్‌ ఫ్లోరిడా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలు ర‌ద్దు చేశారు. ఈ క్ర‌మంలో శ్రీలంక జట్టు వెస్టిండీస్ వెళ్ల‌డం ఆల‌స్యం కానుంది. ఇప్ప‌టికే టోర్న‌మెంట్ నుంచి నిష్ర్క‌మించిన లంక జ‌ట్టు త‌న ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తల‌ప‌డ‌నుంది. వెస్టిండీస్‌లో జ‌రిగే ఈ మ్యాచ్ కోసం లంక జ‌ట్టు బ‌య‌లు దేరాల్సి ఉండ‌గా ప్ర‌తికూల వాతావ‌ర‌ణం కార‌ణంగా విమానాలు ర‌ద్దు కావ‌డంతో వాయిదా ప‌డింది.

Rohit Sharma : కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌.. గంగూలీ రికార్డు బ్రేక్‌.. ధోనిని అందుకునేనా..?