Cheating : ఖతార్ తొండాట.. రిఫరీ సహకారం.. భారత్‌కు తీవ్ర అన్యాయం.. వీడియో
ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026 ఆసియా జోన్ క్వాలిఫయర్స్‌లో భారత జట్టు మూడో రౌండ్‌కు అర్హత సాధించలేకపోయింది.

Fans slam referee after Qatar controversial goal ends India campaign
ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026 ఆసియా జోన్ క్వాలిఫయర్స్‌లో భారత జట్టు మూడో రౌండ్‌కు అర్హత సాధించలేకపోయింది. ఖతార్ తొండాట ఆడి భారత్ పై విజయం సాధించింది. ఖతాల్ ఆటగాళ్లు చేసిన గోల్ సరైంది కాదని భారత ఆటగాళ్లు రిఫరీకి సూచించినా ఫలితం లేకపోయింది. రివ్యూకు వెళ్లాలని ప్రాధేయపడినా రిఫరీ మొండి వైఖరి భారత్‌కు చేటు చేసింది. ఈ మ్యాచ్‌లో ఖతార్ 2-1 తేడాతో గెలిచింది.
గ్రూపు ఏలో భాగంగా మంగళవారం ఖతార్‌తో భారత్ తలపడింది. మూడో రౌండ్‌కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం భారత్‌కు ఎంతో కీలకం కావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. దాదాపు 72 నిమిషాల పాటు భారత హవా కొనసాగింది. ఆట ఆరంభమైన 37 నిమిషంలో లాలియాన్ జువాల గోల్ కొట్టడంతో భారత్ ఖాతా తెరిచింది. 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.
Sri Lanka : వానొచ్చింది.. శ్రీలంక ఔటైంది..?
అయితే.. 73వ నిమిషంలో రిఫరీ చెత్త నిర్ణయం కారణంగా ఖతార్ స్కోరును 1-1తో సమం చేసింది. ఖతార్ ఆటగాడు యూసఫ్ కొట్టిన హెడర్ ను గోల్ కీపర్ గురుప్రీత్‌సింగ్
ఆపాడు. అప్పుడు బంతి గోల్‌లైన్ దాటి బయటకు వెళ్లింది. అయితే.. ఖతార్ ఆటగాడు హష్మీ అల్ హుస్సేన్ బంతిని వెనక్కి లాగి యూసఫ్‌కు పాస్ అందించాడు. యూసఫ్ దాన్ని గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. రిఫరీ దీన్ని గోల్‌గా ప్రకటించాడు.
అయితే.. బాల్ లైన్‌ను దాటిందని, భారత ఆటగాళ్లు రిఫరీ దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికి రిఫరీ భారత ఆటగాళ్లు చెప్పేది వినకుండా ఖతార్‌కు సపోర్ట్ చేశాడు. రివ్యూ తీసుకోవాలని సూచించినా పట్టించుకోలేదు. కాగా.. టీవీ రిప్లేలో బంతి గోల్‌లైన్ దాటి బయటకు వెళ్లినట్లుగా స్పష్టంగా కనిపించింది. రిఫరీ నిర్ణయంతో భారత ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతింది. 85 నిమిషంలో అహ్మద్ అల్‌రావి గోల్ చేయడంతో ఖతార్ 2-1ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. మ్యాచ్ టైమ్ ముగిసే వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న ఖతార్ గెలుపొందింది.
USA vs IND : టీమ్ఇండియాకు అమెరికా స్టార్ ప్లేయర్ వార్నింగ్.. ప్రత్యర్థి ఎవరైనా..
BLATANT CHEATING!! UNBELIEVABLE pic.twitter.com/EeQtgbyjQO
— IFTWC – Indian Football (@IFTWC) June 11, 2024