Sri Lanka : వానొచ్చింది.. శ్రీలంక ఔటైంది..?
అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంకను దురదృష్టం వెంటాడింది.

Sri Lanka staring at early T20 World Cup exit after Florida washout
Sri Lanka – T20 World Cup 2024 : అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంకను దురదృష్టం వెంటాడింది. ఫ్లోరిడా వేదికగా నేపాల్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. వరుణుడు విజృంభించడంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. ఇరు జట్లకు ఒక్కొ పాయింట్‌ను కేటాయించారు. దీంతో లంక సూపర్ 8 అవకాశాలు మరింత సంక్లిష్టం అయ్యాయి.
ఇప్పటికే ఆడిన రెండు మ్యాచుల్లోనూ శ్రీలంక ఓడిపోయిన సంగతి తెలిసిందే. నేపాల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం లంక అవకాశాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తోంది. నెదర్లాండ్స్‌తో జరగనున్న తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లంక భారీ తేడాతో విజయం సాధించినప్పటికి సూపర్ 8 చేరాలంటే ఏదైన అద్భుతం జరగాల్సిందే. మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
USA vs IND : టీమ్ఇండియాకు అమెరికా స్టార్ ప్లేయర్ వార్నింగ్.. ప్రత్యర్థి ఎవరైనా..
శ్రీలంక గ్రూపు డిలో ఉంది. ఈ గ్రూపులో లంకతో పాటు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ జట్లు ఉన్నాయి. ఆడిన మూడు మ్యాచుల్లో గెలిచిన సౌతాఫ్రికా 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. దీంతో ఇప్పటికే దక్షిణాఫ్రికా సూపర్ 8 బెర్తును ఖాయం చేసుకుంది. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌లు చెరో మ్యాచ్‌లో గెలిచి రెండు పాయింట్లతో కొనసాగుతున్నాయి.
బంగ్లా, నెదర్లాండ్స్ జట్ల మధ్య ఓ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు వచ్చి చేరుతాయి. అప్పుడు లంక ఆఖరి మ్యాచ్‌లో గెలిచినా సరే ఆ జట్టు ఖాతాలో మూడు పాయింట్లే ఉంటాయి.
Ambati Rayudu : సీఎంగా పవన్ కళ్యాణ్‌ను చూడాలనేది నా కల.. ఇంకో అడుగు దూరమే : అంబటి రాయుడు
ఒకవేళ లంక సూపర్ 8కి చేరుకోవాలంటే తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారీ స్కోరుతో గెలవాలి. అదే సమయంలో నేపాల్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌ను ఓడించాలి. అంతేకాకుండా నెదర్లాండ్స్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోవాలి. అప్పుడే శ్రీలంక సూపర్-8 ఆశలు సజీవంగా ఉంటాయి.