Virat Kohli : మూడు మ్యాచుల్లో 5 పరుగులు.. కోహ్లి ఫామ్ పై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు.. ఇది ఆరంభమే..
ఐపీఎల్‌లో పరుగుల వరద పారించాడు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.

T20 World Cup 2024 Sunil Gavaskar Blunt Verdict On Kohli Form
Virat Kohli – Sunil Gavaskar : ఐపీఎల్‌లో పరుగుల వరద పారించాడు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. పొట్టి ప్రపంచకప్‌లోనూ తన జోరును కొనసాగిస్తాడు అనుకుంటే అనూహ్యంగా విఫలం అవుతున్నాడు. మూడు మ్యాచుల్లో వరుసగా 1, 4, 0 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో కోహ్లి పై విమర్శల వర్షం మొదలైంది. అమెరికాలోని పిచ్‌లపై ఆచితూచి ఆడాల్సిన సమయాల్లో ఒత్తిడి లోనై అతడు వికెట్‌ను ఈజీగా ఇచ్చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓపెనర్‌గా అతడికి కలిసిరావడం లేదని, అతడికి అచ్చొచ్చిన వన్‌డౌన్‌లోనే బరిలోకి దిగాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.
ఈ క్రమంలో విరాట్ కోహ్లి ఫామ్ పై టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి ఫామ్ పై ఆందోళన చెందాల్సిన పని లేదన్నాడు. మూడు మ్యాచుల్లో విఫలమైనంత మాత్రన అతడిని తక్కువ చేయాల్సిన పని లేదన్నాడు. అతడి పై నమ్మకం ఉంచాలని, త్వరలోనే పరుగుల వరద పారిస్తాడనే విశ్వాస్వాన్ని వ్యక్తం చేశాడు.
దేశం తరుపున మ్యాచులను గెలవడమే ప్రతి ఆటగాడికి ప్రేరణ ఇచ్చే అంశం. గత కొన్నేళ్లుగా టీమ్ఇండియాకు ఎన్నో మరుపురాని విజయాలను కోహ్లి అందించాడు. అది అతడికి గుర్తు ఉండే ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచకప్ టోర్నీ ఆరంభ దశలోనే ఉన్నాం. ఇంకా సూపర్ -8, సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచులు జరగాల్సి ఉంది. ప్రస్తుతం కోహ్లి ఓ పని చేయాలి. కాస్త ఓపిక, ఆత్మవిశ్వాసంతో ఆడితే తప్పకుండా మంచి ఇన్నింగ్స్‌లు ఆడతాడు అని గవాస్కర్ అన్నాడు.
ఓ మూడు మ్యాచుల్లో విఫలం అయిన మాత్రాన కోహ్లిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కొన్నిసార్లు మంచి బాల్స్‌కు వికెట్లు సమర్పించుకోవాల్సి వస్తుంది. ఆ తదుపరి మ్యాచుల్లో అలాంటి బంతులను బౌండరీలకు తరలిస్తాం. కాబట్టి ఆందోళన అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటికి ఎలా రావాలో కోహ్లికి బాగా తెలుసునని గవాస్కర్ చెప్పాడు.
Cheating : ఖతార్ తొండాట.. రిఫరీ సహకారం.. భారత్‌కు తీవ్ర అన్యాయం.. వీడియో
వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచిన భారత్ సూపర్ 8కి చేరుకుంది. గ్రూపు స్టేజీలో చివరిదైన, నామమాత్రపు మ్యాచ్‌లో కెనడాతో ఆడనుంది. ఫ్లోరిడా వేదికగా జూన్ 15న ఈ మ్యాచ్ జరగనుంది.