Pawan Kalyan – Sreeleela : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వర్కింగ్ స్టిల్ షేర్ చేసిన డైరెక్టర్.. పవన్, శ్రీలీలతో హరీష్..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Pawan Kalyan – Sreeleela : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో ‘గబ్బర్ సింగ్’ తరువాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ రాజకీయ బిజీ వల్ల పక్కన పెట్టారు. కొంచెం లేట్ అయినా ఈ సినిమా మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కొద్దిగా పూర్తి చేశారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Also Read : Committee Kurrollu : నిహారిక నిర్మాతగా.. కమిటీ కుర్రాళ్ళు టీజర్ వచ్చేసింది.. 90’s కిడ్స్ కోసమే ఈ సినిమా..?

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు శ్రీలీల పుట్టిన రోజు అవడంతో తను నటిస్తున్న చిత్రాల నుంచి స్పెషల్ గా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఓ వర్కింగ్ స్టిల్ ని షేర్ చేసి శ్రీలీలకు శుభాకాంక్షలు తెలిపి, త్వరలోనే మళ్ళీ షూట్ మొదలుపెడదాం అని తెలిపారు.

అయితే ఈ ఫొటోలో.. హరీష్ శంకర్, శ్రీలీల ఉయ్యాల మీద కూర్చొని హరీష్ శ్రీలీలకు సీన్ చెప్తుండగా వెనకాలే పవన్ కళ్యాణ్ కూడా నిల్చొని ఉన్నాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. అటు శ్రీలీల ఫ్యాన్స్, ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే పవన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు